Saturday, November 8, 2025
E-PAPER
Homeజిల్లాలు33 ఎకరాల్లో పంట నష్టం.!

33 ఎకరాల్లో పంట నష్టం.!

- Advertisement -

మోంథా తుఫానుతో నష్టపోయిన మండల రైతులు
వివరాలు సేకరించిన వ్యవసాయ అధికారులు
నవతెలంగాణ – మల్హర్ రావు

మోంథా తుపానుతో మండలంలో 33 ఎకరాల్లో పంట నష్టం జరిగినట్లు మండల వ్యవసాయ శాఖ నిర్ధారించింది.గత వారం కింద ఎడతెరిపి లేకుండా వర్షాలు కురిశాయి. కానీ చెరువులు, కుంటలు నిండేలా సమృద్ధి వానలు కురవలేదు.మండలంలో కేవలం ఎడ్లపల్లి బొగ్గుల వాగు ప్రాజెక్టు,కాపురం చెరువు చెరువులోకి కొద్దిపాటి వరద నీరు మినహా ఆయా గ్రామాల్లో జల వనరులు స్వల్పంగానే నిండాయి. పత్తి, వరి చేలల్లో నీరు చేరడంతో చేతికొచ్చిన పంట నేల పాలైంది. కానీ ఆ తర్వాత రెండు రోజులకే వర్షాలు కనుమరుగు కావడంతో ఎండ తీవ్రతకు పంటలు నష్టపోకుండా మిగిలాయి.

ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు ఆయా గ్రామాల్లోని ఏఈఓలు వర్షాలు కురిసిన గ్రామాల్లో వరి,పత్తి పంటలను పరిశీలించి నష్టపోయిన రైతుల వివరాలను నమోదు చేసుకున్నారు. వందమంది రైతులను సర్వేలో గుర్తించారు. నష్టపోయిన పంటలకు పరిహారం అందజేయడానికి వ్యవసాయ శాఖ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు నివేదిక పంపింది. రైతులు వరి పంటకుఎకరాకు రూ.20 వేలకు పైగా ఖర్చు చేయగా, పత్తి పంటకు మాత్రం ఎకరాకు రూ.30 వేలకు పైగానే ఖర్చు చేశారు. పత్తి క్వింటాల్ ధర సీసీఐ కేంద్రాల్లో రూ.8 వేలకు పైగా డిమాండ్ ఉండగా అంతకు పైగా నష్టపరిహారం అందజేయాలని రైతులు కోరు తున్నారు. మోంథా తుపానుతో నష్టపోయిన పం టలకు ఎకరాకు రూ.పది వేల పరిహారాన్ని అంద జేస్తామని రాష్ట్ర సర్కార్ ప్రకటించిన నేపథ్యంలో ఆ పరిహారానైన త్వరగా అందేలా చూడాలని రైతులు కోరుతున్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -