– మాజీ ఎమ్మెల్సీ శేరి సుభాష్ రెడ్డి
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
భారీ వర్షాల కారణంగా కామారెడ్డి , మెదక్ జిల్లాల్లో లక్ష ఎకరాలకు పైగా పంట నష్టం జరిగిందనిమాజీ ఎమ్మెల్సీ శేరి సుభాష్‌రెడ్డి తెలిపారు. శుక్రవారం హైదరాబాద్‌లోని తెలంగాణ భవన్‌లో విలేకర్లతో ఆయన మాట్లాడుతూ మెదక్, కామారెడ్డి జిల్లాల్లో 40 సెంటిమీటర్ల వర్షం పడటం వల్ల వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయన్నారు. వరదల్లో చిక్కుకున్న ప్రజలను కాపాడేందుకు హెలీకాప్టర్లు పంపటంలో నిర్లక్ష్యం వహించారని ఆవేదన వ్యక్తం చేశారు. ఐదు రోజులవుతున్నా నీళ్లు అలాగే ఉన్నాయని తెలిపారు. ధూప్ సింగ్ తండా లోకి నీళ్లు వచ్చినా ప్రభుత్వం కనీసం ఆదుకోలేదని విమర్శించారు. ముఖ్యమంత్రి, మంత్రులు తిరగడానికి హెలికాప్టర్ ఉంటుంది కానీ, ప్రజల కోసం అందుబాటులో ఉండవా? అని ప్రశ్నించారు. ప్రభుత్వ నిర్లక్ష్యం వల్ల మూడు కుటుంబాలు వరదలో కొట్టుకుపోయాయని చెప్పారు. రోడ్లు కొట్టుకు పోయినా ఎవరు పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఉమ్మడి మెదక్ జిల్లా మంత్రి వివేక్ మాటలు అవివేకంగా ఉన్నాయని విమర్శించారు. వర్షాలు వస్తుంటే మూసి సుందరీకరణ పై ముఖ్యమంత్రి సమీక్ష పెట్టడమేంటని ప్రశ్నించారు.
భారీ వర్షాలతో లక్ష ఎకరాల్లో పంట నష్టం
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES