Saturday, February 28, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్రైతులకు పంట రోగ నిర్ధారణ కార్డు

రైతులకు పంట రోగ నిర్ధారణ కార్డు

- Advertisement -

ఎఫ్‌పీఓ ఆధ్వర్యంలో పంపిణీ
నవతెలంగాణ – చిన్నకోడూరు

రైతులకు పంటల రోగాలను ముందస్తుగా గుర్తించి సరైన నివారణ చర్యలు తీసుకునేందుకు పంట రోగ నిర్ధారణ కార్డులను ఎఫ్‌పీఓ చైర్మన్ ఎలేటి వెంకట్ రెడ్డి ఆధ్వర్యంలో పంపిణీ చేశారు. ఈ సందర్భంగా చైర్మన్ మాట్లాడుతూ పంటలపై వచ్చే తెగుళ్లు, పురుగుమందుల సరైన వినియోగం, పోషక లోపాల లక్షణాలు వంటి అంశాలను ఈ కార్డులో స్పష్టంగా ఉంటాయన్నారు.  రైతులు పంటల్లో మార్పులు గమనించిన వెంటనే కార్డు ఆధారంగా సమస్యను గుర్తించి రోగ నివారణకు మందులను పిచికారీ చేసుకోవచ్చన్నారు.

రైతుల ఖర్చులు తగ్గించి దిగుబడులు పెంచడమే నన్నారు.రసాయనాల ఎరువుల వినియోగాన్ని తగ్గించి సమగ్ర కీటకనాశక  విధానాలను పాటించాలని రైతులకు సూచించారు. ఐకార్, ఐఐవిఅర్, క్రాప్ సింక్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థలు సంయుక్తంగా రైతులకు కార్డులు, డిస్ప్లేను అందించినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో డైరెక్టర్లు మధుసూదన్ రెడ్డి, వెంకట్ రెడ్డి, కిష్టారెడ్డి, రైతులు రోశయ్య, బాల్ రాజు, తదితరులున్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -