- Advertisement -
అక్కల బాపు యాదవ్..రైతు సంఘం నాయకుడు
నవతెలంగాణ – మల్హర్ రావు:
కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలు రైతులను మోసం చేస్తూ వారిని దయనీయ స్థితిలోకి నెట్టివేశాయని రైతు సంఘం నాయకుడు అక్కల బాపు యాదవ్ ఆదివారం ఒక ప్రకటనలో ఆరోపించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలు ఫసల్ బీమా యోజనను రాష్ట్రంలో అమలు చేసి ఉంటే, అధిక వర్షాల నష్టపోయిన రైతులకు బీమా వచ్చేదన్నారు.రైతులకు పరిహారం పదివేల రూపాయలు ఇస్తామని చెప్పి నెలలు గడుస్తున్నా.. ఇంతవరకు ఏ ఒక్క రైతుకు కూడా పరిహారం అందించలేదన్నారు.ఇప్పటికైనా రాష్ట్రంలో పసల్ బీమా అమలు చేసి,పంటలు నష్టపోయిన రైతులను ఆదుకోవాలని కోరారు.
- Advertisement -



