నవతెలంగాణ – రెంజల్
గత 30 రోజుల కిందటి నుంచి శ్రీరామ్ సాగర్ బ్యాక్ వాటర్ ద్వారా నష్టపోయిన రైతులకు ఇంతవరకు నష్టపరిహారం చెల్లించకపోవడం ప్రభుత్వ నిర్లక్ష్యమేనని బీజేపీ మండల కార్యవర్గం ప్రకటించింది. గురువారం రెంజల్ తహసిల్దార్ శ్రవణ్ కుమార్ కు వినతి పత్రాన్ని అందజేశారు. పంట నష్టం నివేదికను తయారుచేసి నెలలు గడుస్తోంది ఇంతవరకు నష్టపరిహారం ప్రకటించక పోవడం శోచనీయమన్నారు. మండలంలో ఇందిరమ్మ ఇండ్ల కేటాయింపుల్లో అర్హులకు కాకుండా, తమ పార్టీకి సంబంధించిన వారికి కేటాయించడం జరుగుతుందని, వారు ఆరోపించారు.
రైతులకు పంట నష్టి ఆరం ప్రకటించడంతోపాటు ఆరుగులైన వారందరికీ ఇందిరమ్మ ఇండ్లను కేటాయించకపోయినట్లయితే పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేపడతామని వారు వినతిపత్రంలో కోరారు. ఈ కార్యక్రమంలో బిజెపి పార్టీ మండల అధ్యక్షులు క్యాతం యోగేష్, జిల్లా మాజీ ఉపాధ్యక్షులు మేక సంతోష్, మండల కార్యదర్శి ఈర్ల రాజు, ప్రసాద్, నాగరాజు, రమేష్, లక్కోజి రూపేష్, మురళి, మరియు బిజెపి కుటుంబ సభ్యులు పాల్గొన్నారు.