నవతెలంగాణ – జుక్కల్
మండలంలోని జుక్కల్ గ్రామంలోనీ జుక్కల్ శివారులో బొంపెల్లి వార్ రాందాస్ పొలంలోని పెసర పంటను వ్యవసాయ అధికారులైన పండరి ఏఈఓ (జుక్కల్), హంగర్గా ఏఈఓ నాందేవ్ గురువారం నాడు సందర్శించడం జరిగింది. ఈ సందర్భంగా పెసర , మినుము మరియు సోయా రైతు పొలంలోకి వెళ్లి క్షేత్రస్థాయి పరిశీలన చేయడం జరిగింది. రైతుకు పెసర పంట యొక్క తెగులు నివారణకు తగు సస్య రక్షణ చర్యలు చేపట్టాలని రైతులకు సూచించారు. అదేవిధంగా రసాయన ఎరువులు తగ్గించి సేంద్రియ ఎరువుల వైపు రైతులు ఎక్కువగా మగ్గు చూపాలని పంట దిగుబడి రావాలంటే భూసారము బాగుండాలని అందుకే రసాయన ఎరువులు వాడకం తగ్గించాలని రైతులకు అవగాహనపరిచారు. ఖరీఫ్ సీజన్లో భాగంగా పెసరకు పలు రకాలైన తెగుళ్లు వచ్చే అవకాశం ఉందని వర్షాలు సకాలంలో కురువకపోవడం వలన తెగులు సోకుతాయని అందుకే పంటకు వ్యవసాయ అధికారుల సలాం మీరు మోతాదుగు లో రసాయన ఎరువులు వాడి పిచికారి చేయాలని వాటి గురించి సలహా సూచనలు ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఏఈఓ లతోపాటు రైతు బొంపెలి రాందాస్, బొంపెల్లి విజయ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు .
పెసర పంటకు సస్యరక్షణ చర్యలు చేపట్టాలి…
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES