Wednesday, May 14, 2025
Homeతెలంగాణ రౌండప్పంట మార్పిడి సుస్థిరాదాయానికి సోపానం..

పంట మార్పిడి సుస్థిరాదాయానికి సోపానం..

- Advertisement -

వ్యవసాయ విశ్వవిద్యాలయ విస్తరణ సంచాలకులు డాక్టర్ యాకాద్రి…
నవతెలంగాణ – భువనగిరి కలెక్టరేట్ 
: పంట మార్పిడి సుస్థిర ఆదాయానికి సోపానం  – ఆచార్య జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయ విస్తరణ సంచాలకులు డాక్టర్ ఎమ్ యాకాద్రి అన్నాను. బుధవారం భువనగిరి మండలంలో చందుపట్ల గ్రామంలో ” రైతు ముంగిట్లో శాస్త్రవేత్తలు” అను కార్యక్రమం ఏరువాక కేంద్రం , యాదాద్రి భువనగిరి ఆధ్వర్యంలో నిర్వహించారు.  ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా హాజరై, మాట్లాడారు. పంట మార్పిడి చేయకుండా ఒకే పంటను వరుస క్రమంలో  సాగుచేయడం వల్ల నేల క్రమేపి నిర్వీర్యమౌతుందన్నారు.ఒకే భూమిలో ఏటా వేర్వేరు పంటలను ఒక  క్రమంలో సాగు చేయాలన్నారు. పంట మార్పిడి  వల్ల నేలలోని వివిధ లోతుల పొరల నుంచి పోషకాలు వినియోగింపబడుతూ నేల సారం  పరిరక్షింపబడుతుందన్నారు. పంట మార్పిడి పాటించచడం వలన పరిమిత నీటివసతితో పలు పంటల సాగు చేయవచ్చన్నారు.చీడపీడల పై అదుపు మరియు వాటి వృద్ధిని నిరోధించేందుకు వీలు కలుగుతుందన్నారు.  ఈ కార్యక్రమంలో ప్రధానంగా 5 అంశాలని ప్రధాన శాస్త్రవేత్త డాక్టర్ బి అనిల్ కుమార్ వివరించారు. అనవసర అధిక యూరియా వినియోగాన్ని తగ్గించి, సాగు ఖర్చును తగ్గించాలని, అవసరం మేరకే రసాయనాలను వినియోగించి నేలతల్లి ఆరోగ్యాన్ని కాపాడడం , విక్రయ కేంద్రాల్లోని రసీదులను భద్రపరచి కష్టకాలంలో నష్టపరిహారాన్ని పొందవచ్చు అన్నారు.  సాగునీటిని ఆదా చేసి, భావితరాలకు అందించడం, చెట్లను పెంచి పర్యావరణాన్ని కాపాడాలనారు. ఈ కార్యక్రమంలో ఏరువాక కేంద్రం శాస్త్రవేత్తలు డాక్టర్ బి. అనిల్ కుమార్, బి. రాజా మధుశేఖర్, భూగర్భ నీటి విభాగం ఇంజనీర్ అశ్విత్, మండల వ్యవసాయ అధికారి మల్లేష్, వ్యవసాయ విస్తరణ అధికారి అనిల్, జిల్లా పరిషత్ పాఠశాల ఉపాధ్యాయులు వేణుగోపాల్, మాజి ఎం పి టి సి కొండల్ రెడ్డి , అభ్యుదయ రైతులు మందడి సిద్ధారెడ్డి, కంచె మల్లయ్య, రాములు, కృష్ణా రెడ్డి, మార్కెట్ కమిటి డైరెక్టర్  రంగా కృష్ణయ్య , రాజేంద్రనగర్ వ్యవసాయ కళాశాల విద్యార్థినులు, ప్రత్తి పరిశోధన సంస్థ తరపున  విజయకాంత్ , రూపా, అధిక  సంఖ్యలో రైతులు పాల్గొన్నారు. 

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -