Friday, October 17, 2025
E-PAPER
Homeఖమ్మంవాతావరణ, సాంకేతిక మార్పులకు అనుగుణంగా పంట మార్పిడి జరగాలి

వాతావరణ, సాంకేతిక మార్పులకు అనుగుణంగా పంట మార్పిడి జరగాలి

- Advertisement -

– టన్ను గెలలు ధర రూ. 25 వేలు ఉండేలా కృషి
– పామాయిల్ విత్తన నాటు కార్యక్రమంలో మంత్రి తుమ్మల
నవతెలంగాణ – అశ్వారావుపేట

వాతావరణం, సాంకేతికత మార్పులకు అనుగుణంగా రైతులు పంట మార్పిడి, సాగులో యాజమాన్యం పద్దతులను అవలంభించాలని తెలంగాణ వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు రైతులకు పిలుపునిచ్చారు. శుక్రవారం స్థానిక ఆయిల్ ఫెడ్ పామాయిల్ కేంద్రీయ నర్సరీలో  ఆధునిక పద్దతిలో పామాయిల్ విత్తనాలు నాటే కార్యక్రమాన్ని ఆయన లాంచనంగా ప్రారంభించారు. 

ఆయిల్ ఫెడ్ చైర్మన్ జంగా రాఘవరెడ్డి అద్యక్షతన ఏర్పాటు చేసిన రైతులతో ముఖాముఖి లో మంత్రి తుమ్మల మాట్లాడుతూ మొక్కలు పెంపకంలో గతంలో తలెత్తిన వైఫల్యాలను అధిగమించి పొట్టి రకం,అధిక దిగుబడులు తో పాటు చీడపీడలు తట్టుకునే నాణ్యమైన పామాయిల్  మొక్కలను రైతులకు అందజేయడానికి మలేసియా నుండి విత్తనాలు తెచ్చి మొక్కలు పెంచుతున్నామని అన్నారు.రైతులకు గిట్టుబాటు అయ్యే విధంగా టన్ను గెలలు ధర రూ.25 వేలు ఉండేలా స్థిరీకరణ కు కృషి చేస్తున్నామని భరోసా కల్పించారు. సాగు విస్తీర్ణం కు అనుగుణంగా పరిశ్రమలు నిర్మిస్తామని అన్నారు.

కొబ్బరి అభివృద్ది బోర్డ్ ను ఏర్పాటు చేయాలి: మ్మెల్యే జారె ఆదినారాయణ

ఎమ్మెల్యే జారె ఆదినారాయణ మాట్లాడుతూ.. నియోజక వర్గంలో అభివృద్ది లో తుమ్మల పాత్ర అమోఘం అని,వ్యవసాయం,సామాజికంగా నూతన వరవడి తీసుకురావడం తుమ్మ ఆదర్శం అని కొనియాడారు. పామాయిల్ తర్వాత కొబ్బరి సాగు ఉన్నందున తెలంగాణ రాష్ట్రానికి కొబ్బరి అభివృద్ది బోర్డ్ ఏర్పాటు దిశగా కృషిచేయాలని, అచ్యుతాపురం లో అటవీ పరిశోధనా కేంద్రం పునరుద్ధరించాలని, నర్సరీలు కు ఉచిత విద్యుత్ ఇవ్వాలి అని,నాణ్యమైన నేల,సారవంతం అయి మృత్తిక ఉన్నందున నర్సరీలను ప్రోత్సహించడం తో ఈ ప్రాంత గిరిజనులు ఆర్ధిక సాధికారత సాధిస్తారని మంత్రి తుమ్మలను కోరారు.

ఆయిల్ ఫెడ్ సంస్థల్లోకి మీడియా నిరాకరణ అధికారుల అత్యుత్సాహమమే : ఆయిల్ ఫెడ్ చైర్మన్ జంగా రాఘవరెడ్డి

ఆయిల్ ఫెడ్ చైర్మన్ జంగా రాఘవరెడ్డి మాట్లాడుతూ.. ఆయిల్ ఫెడ్ సంస్థల్లోకి ప్రింట్ అండ్ ఎలెక్ట్రానిక్ మీడియా నిరాకరిస్తూ ఇచ్చిన సర్క్యులర్ సంస్థ అధికారులు అత్యుత్సాహం మే నని,మీడియా స్వేచ్ఛకు భంగం కలిగేలా తీసుకున్న నిర్ణయానికి చింతిస్తున్నాను అన్నారు. 10 వేలు మంది రైతులు పామాయిల్ లబ్ధిదారులు గా ఉన్నారని, గత వైఫల్యాలు పునరావృతం కాకుండా చర్యలు తీసుంకుంటున్నానని,ప్రతీ రైతు ఆర్ధికాభివృద్ధి ఆయిల్ ఫెడ్ కృషి చేస్తుంది అని అన్నారు.

11 లక్షల ఎకరాలకు పామాయిల్ సాగును విస్తరిస్తామని, ఉమ్మడి  11 జిల్లాల్లోనూ పరిశ్రమలు నిర్మిస్తాం అన్నారు. ఈ కార్యక్రమంలో సత్తుపల్లి ఎమ్మెల్యే మట్టా రాగమయి దయానంద్,ఎండీ శంకరయ్య,ఉన్నతాధికారులు సుధాకర్ రెడ్డి,శ్రీకాంత్ రెడ్డి, ఓఎస్డీ కిరణ్ కుమార్,డీఓ నాయుడు రాధాక్రిష్ణ,మేనేజర్ లు నాగబాబు,కళ్యాణ్ గౌడ్, వ్యవసాయ కళాశాల ఏడీ హేమంత్ కుమార్, ఆలపాటి రాజేంద్రప్రసాద్ లు సుంకవల్లి వీరభద్రరావు లు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -