Saturday, October 4, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్అకాల వర్షానికి తడిసిన పంటలు 

అకాల వర్షానికి తడిసిన పంటలు 

- Advertisement -

నవతెలంగాణ-పాలకుర్తి
రైతులను వర్షాలు ముంచెత్తుతున్నాయి. చేతి కందిన పంటలు వర్షానికి తడవడంతో రైతన్నలు ఆందోళన చెందుతున్నారు. శనివారం భారీ వర్షం కురవడంతో పత్తి, వరి, మొక్కజొన్న పంటలను సాగు చేసిన రైతులకు ఇబ్బందులు తప్పడం లేదు. పత్తి పంట ఇళ్లకు, మొక్కజొన్న పంట మార్కెట్ కు, వరి పంట కల్లాలకు చేరే సమయానికి వర్షం దంచి కొట్టింది. పత్తి పంట చేలలోనే కలిసి ముద్దయిందని రైతులు ఆవేదన చెందారు. ఎడగారు వరి పంట కోత సమయంలో వర్షం పడడం వరి కోత యంత్రాలకు డిమాండ్ పెరగడంతో రైతులపై ఆర్థిక భారం తప్పడం లేదు. పంటలు చేతికందే సమయానికి వర్షాలు దంచి కొట్టడంతో దిక్కుతోచని స్థితిలో రైతన్నలు అయోమయానికి గురవుతున్నారు. అవసరానికి కురువని వర్షాలు ఇప్పుడు చెడగొట్టడానికి కురుస్తున్నాయని రైతులు అభిప్రాయపడుతున్నారు. వర్షాలకు తోడు కూలీల కొరత ఉండడంతో రైతులు ఆవేదనకు గురవుతున్నారు. వర్షాలతో రైతులకు తీవ్రమైన నష్టం వాటిల్లింది.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -