నవతెలంగాణ – వెల్దండ : మొంథా తుఫాన్ ప్రభావంతో మండల వ్యాప్తంగా కురిసిన భారీ వర్షాలుకు రైతుల పంటలు నాశనం అయ్యాయి. వెల్దండ మండల కేంద్రంతో పాటు మండల పరిధిలోని ఆయా గ్రామాల్లో వాగులు, వంకలు ఉధృతంగా ప్రవహించడంతో పొలాలు నీటమునిగాయి. ముఖ్యంగా వరి, మొక్కజొన్న, పత్తి పంటలు తీవ్రంగా దెబ్బతిన్నాయి.వ్యవసాయ శాఖ అధికారుల అంచనాల ప్రకారం వందల ఎకరాల్లో పంటలు నీట మునిగినట్టు తెలిపారు. పెద్దాపూర్ ,వెల్దండ, కోట్ర, గుండాల గ్రామాల పరిసర ప్రాంతాల్లో వరిపొలాలు ఇంకా నీటిలోనే ఉన్నాయి. వరి పంట వాలిపోవడం, పత్తి గింజలు కుళ్లిపోవడం, మొక్కజొన్న పొలాల్లో మొక్కలు నేలమట్టమవడం వంటివి చోటుచేసుకున్నాయి. ఈ నేపథ్యంలో వ్యవసాయ విస్తరణ అధికారి గణేష్, కోట్ర ఏ ఈ ఓ ప్రవీణ్ మాట్లాడుతూ.. ప్రస్తుతం క్షేత్రస్థాయిలో పంటనష్టాన్ని అంచనా వేస్తామన్నారు. రైతుల నష్ట నివారణకు నివేదికలు సిద్ధం చేసి పై అధికారులకు పంపుతాం మన్నారు. ప్రభుత్వం నుండి వీలైనంత త్వరగా సాయం అందేలా చర్యలు తీసుకుంటాం అని తెలిపారు. ప్రభుత్వం తక్షణమే స్పందించి పంట నష్టాన్ని అంచనా వేసి రైతులను ఆదుకోవాలని కోరుతున్నారు.
మొంథా తుఫాన్ ప్రభావంతో నీట మునిగిన పంటలు..
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES

 
                                    