నవతెలంగాణ – వేములవాడ : దక్షిణ కాశీగా పేరొందిన ప్రముఖ పుణ్యక్షేత్రమైన వేములవాడలోని శ్రీ రాజరాజేశ్వర స్వామివారి క్షేత్రానికి భక్తుల తాడికి కొనసాగుతోంది. శనివారం స్వామివారి దర్శనానికి రాష్ట్రంలోని వివిధ ప్రాంతా లతోపాటు ఇతర రాష్ట్రాల నుంచి భక్తులు తరలి వచ్చారు. విద్యాసంస్థలకు సెలవులు రావడంతో భక్తులు కుటుంబ సభ్యులతో వచ్చి ఆలయ ధర్మగుండ పుష్కరిణిలో పుణ్యస్నానాలు ఆచరించి స్వామివా రిని దర్శించుకున్నారు. క్యూలైన్లు, కల్యాణకట్ట, ధర్మగుండం, ఆలయ పరిసరాలు భక్తులతో సంద డిగా మారాయి. స్వామివారికి ప్రీతిపాత్రమైన కోడె మొక్కులను భక్తులు కుటుంబ సమేతంగా చెల్లించుకున్నారు. భక్తులు వివిధ పూజా కార్యక్రమాల్లో పాల్గొని తరించారు. పలువురు భక్తులు బంగారం(బెల్లం) స్మామివారికి సమర్పించి మొక్కులు తీర్చుకున్నారు. భక్తులకు ఇబ్బందులు కలుగకుండా ఆలయ అధికారులు పర్యవేక్షణ చేశారు. దాదాపు 25 వేలకు పైగా మంది స్వామి వారిని దర్శించుకోనున్నట్లు ఆలయ అధికారులు తెలిపారు. బద్ది పోచమ్మ, భీమేశ్వరస్వామి ఆలయా లను భక్తులు సందర్శించి మొక్కులు చెల్లించుకున్నారు.
రాజన్న దేవాలయంలో భక్తుల రద్దీ..
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES