Saturday, August 23, 2025
E-PAPER
spot_img
Homeజాతీయంజమ్మూ కాశ్మీర్‌లో మళ్లీ జన సందడి ..

జమ్మూ కాశ్మీర్‌లో మళ్లీ జన సందడి ..

- Advertisement -

శ్రీనగర్‌ : భారత్‌-పాకిస్తాన్‌ కాల్పుల విరమణ ప్రకటనతో … జమ్మూ కాశ్మీర్‌ సరిహద్దు జిల్లాల్లోని జనజీవనం మళ్లీ సాధారణ స్థితికి వచ్చింది. నిన్న రాత్రి ప్రశాంతంగా గడిచింది. నియంత్రణ రేఖ, అంతర్జాతీయ సరిహద్దు వెంబడి దళాల మధ్య ఎలాంటి ఘర్షణలు జరిగినట్లు నివేదికలు లేవు. ఈ విషయాన్ని సైన్యం కూడా ఈ ఉదయం ధ్రువీకరించింది. దీంతో అక్కడి ప్రజలు ఊపిరి పీల్చుకున్నారు. భారతదేశం, పాకిస్తాన్‌ మధ్య కాల్పుల విరమణ ప్రకటన తర్వాత… ముంబైలోని ప్రజలు కూడా ఉపశమనం పొంది తమ మద్దతును వ్యక్తం చేశారు. గురుకుల స్కూల్‌ ఆఫ్‌ ఆర్ట్‌ విద్యార్థులు ప్రదర్శన కోసం ఒక పెయింటింగ్‌ను తీసుకెళుతూ తమ మద్దతును ప్రకటించారు.
మళ్లీ మొదలైన సాధారణ దినచర్యలు ….
అమత్‌సర్‌లో ప్రజలు సాధారణ కార్యకలాపాలను తిరిగి ప్రారంభించారు. శ్రీనగర్‌లోని ఐకానిక్‌ లాల్‌ చౌక్‌ వద్ద జనం గుమిగూడారు. శాంతి, ఆశకు ప్రతీకగా, చాలా మంది ప్రజలు బెలూన్‌లను పట్టుకుని కనిపించి ఆనందాన్ని వ్యక్తం చేశారు. జమ్మూలో సాధారణ కార్యకలాపాలు తిరిగి ప్రారంభమవ్వడంతో ప్రజలు వారివారి ప్రయాణాలు చేశారు. శ్రీనగర్‌లో మార్కెట్లు తెరుచుకున్నాయి. రోజువారీ దినచర్యలకు ప్రజలు తిరిగి వచ్చారు. అమత్‌సర్‌లోని హెరిటేజ్‌ స్ట్రీట్‌లో జనసమూహం కనిపించింది. అక్కడ ప్రజలు హాయిగా నడుస్తూ సాధారణ స్థితికి తిరిగి రావడం… ఉపశమనం కలిగించే భావనను ప్రతిబింబించింది. అమత్‌సర్‌లోని స్వర్ణ దేవాలయానికి కూడా ప్రజలు పెద్ద సంఖ్యలో చేరుకున్నారు. ఢిల్లీలోని పర్యాటకులు ప్రశాంతంగా నడుస్తూ కనిపించారు. రోజుల తరబడి ఉద్రిక్తత తర్వాత ప్రశాంతమైన, వాతావరణం మళ్లీ జమ్మూ కాశ్మీర్‌లో ప్రతిబింబించింది. అప్పటివరకు నిశ్శబ్దంగా ఉన్న జమ్మూ కాశ్మీర్‌ మళ్లీ జన సంచారంతో సందడి చేసింది. కాల్పులు, డ్రోన్‌ల దాడులు లేదా షెల్లింగ్‌లకు భయపడకుండా కాశ్మీర్‌ ప్రజలు ఈ రోజు ప్రశాంతంగా మేల్కొన్నారు. దాడి భయం ఉన్నప్పటికీ … ప్రజలు తమ దుకాణాలను తెరిచి, మునుపటిలాగే ఉదయం టీ దుకాణాల వద్ద గుమికూడారు.
కొనసాగుతున్న సరిహద్దు ఆంక్షలు ….
మరోవైపు సరిహద్దు వద్ద ఆంక్షలు కొనసాగుతున్నాయి. పాఠశాలలు మాత్రం పనిచేయడం లేదు. శనివారం సాయంత్రం 5 గంటల నుండి భూ, వాయు, నావికా రంగాలలో అన్ని కాల్పులు, సైనిక కార్యకలాపాలను నిలిపివేయాలని భారతదేశం, పాకిస్తాన్‌ అంగీకరించాయి. అయితే పాకిస్తాన్‌ కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘించిందని, సరిహద్దు వెంబడి రెచ్చగొట్టే చర్యలకు పాల్పడిందని మొన్న జరిగిన సంయుక్త సైనిక విలేకరుల సమావేశంలో ధ్రువీకరించారు. కానీ నిన్న రాత్రి కాశ్మీర్‌లో ప్రశాంతంగా ఉందని సైన్యం తెలిపింది. ఈరోజు కాల్పుల విరమణ ఒప్పందంపై సైనిక అధిపతులు చర్చించనున్నారు.

- Advertisement -
spot_img
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -spot_img
Ad
Ad