నల్లమల్లలో బారులుతీరిన సందర్శకులు
సాయంత్రం 7 గంటల వరకే అడవిలోకి అనుమతి : డీఎస్పీ శ్రీనివాసులు
నవతెలంగాణ- అచ్చంపేట
నాగర్‌కర్నూల్ జిల్లా అమ్రాబాద్ టైగర్ రిజర్వ్ ఫారెస్ట్ నల్లమల్ల అటవీ ప్రాంతంలో వెలసిన లింగమయ్య సలేశ్వరం జాతర ఉత్సవాలకు జనం పోటెత్తారు. అటవీ ప్రాంతమంతా జనసంద్రంగా మారింది. ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లా నుంచి కాకుండా కర్నాటక, ఆంధ్రప్రదేశ్ నుంచి పర్యాటకులు అధిక సంఖ్యలో లింగమయ్య దర్శనానికి తరలివస్తున్నారు. అచ్చంపేట, నాగర్ కర్నూల్ ఆర్టీసీ డిపోల నుంచి సలేశ్వరం జాతరకు స్పెషల్ బస్సులు నడుపుతున్నారు. అధికారులు అన్ని రకాల ఏర్పాట్లు చేశారు. గురువారం మధ్యాహ్నం జిల్లా కలెక్టర్, ఎస్పీ, అచ్చంపేట ఆర్టీఓ, రెవెన్యూ అధికారులు జాతర పరిసరాలను పరిశీలించారు. పర్యటకుల రక్షణ కొరకు పోలీస్ అధికారులు కట్టదిట్టమైన చర్యలు తీసుకుంటున్నారు. ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం 7 గంటల వరకే అడవిలోకి ప్రవేశం ఉంటుందని అచ్చంపేట డీఎస్పీ శ్రీనివాసులు వెల్లడించారు.
సలేశ్వరం జాతరకు పోటెత్తిన జనం
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



