డాలర్‌తో 93కు పడిపోవచ్చు
రష్యాయేతర ఆయిల్ కొనుగోలుతో ప్రభావం : ఫిచ్ రేటింగ్స్ విశ్లేషణ
న్యూఢిల్లీ : అమెరికా ఒత్తిడితో రష్యాయేతర చమురు కొనుగోళ్లకు భారత్ మొగ్గు చూపడం ద్వారా రూపాయి మరింత బలహీనపడనుందని ఫిచ్ రేటింగ్స్ అంచనా వేసింది. ఖరీదైన రష్యాయేతర ముడిచమురు కొనుగోలు కారణంగా 2026 నాటికి డాలర్‌తో రూపాయి విలువ 93కి పడిపోవచ్చని విశ్లేషించింది. గతేడాది కాలంలో డాలర్‌తో రూపాయి 5 శాతం పతనమై 92 మార్క్‌ను దాటిన విషయం తెలిసిందే. ”గతేడాది డాలర్‌తో పోలిస్తే 5 శాతం క్షీణించిన రూపాయి ఇటీవల యుఎస్- ఇండియా వాణిజ్య ఒప్పందం వల్ల ప్రస్తుతం రూ.90.4 వద్ద నమోదవుతోంది. మేం గతంలో డాలర్‌తో రూపాయి విలువ 95కి చేరుతుందని అంచనా వేయగా.. ఇప్పుడు 2026 చివరి నాటికి రూపాయి మరింత నెమ్మదిగా క్షీణించి సుమారు 93 వద్ద ట్రేడ్ కావొచ్చని భావిస్తున్నాం.
మార్కెట్ల నుంచి ఎఫ్‌ఐఐలు తరలిపోవడం, వాణిజ్య ఒప్పందం ప్రకారం ఖరీదైన రష్యాయేతర ముడి చమురు వైపు మళ్లడం ఈ క్షీణతకు కారణమవుతాయి.” అని ఫిచ్ తన నివేదికలో పేర్కొంది.
అమెరికా వడ్డీ రేట్ల తగ్గింపు ఆసియా కరెన్సీలకు మద్దతునిస్తుందని.. అయితే దేశీయ స్థిరత్వం కీలకపాత్ర పోషిస్తుందని ఫిచ్ తెలిపింది. ‘బలహీనమైన యుఎస్ డాలర్ నేపథ్యం ఎంపిక చేసిన కరెన్సీలకు మద్దతు ఇస్తుంది.. కానీ లాభాలు అసమానంగా ఉంటాయి. బలమైన కరెంట్ ఖాతాలు, ఆర్థిక లోటు, వాణిజ్య క్షీణత లేదా జోక్యం ఎక్కువగా ఉండే దేశాల కరెన్సీలు తమ విలువను నిలబెట్టుకోవడంలో ఇబ్బంది పడతాయి.” అని ఫిచ్ తెలిపింది.
రూపాయికి ముడిచమురు సెగ..!
- Advertisement -
- Advertisement -



