వాషింగ్టన్ : అమెరికా, ఇరాన్‌ల మధ్య తాతాల్కిక కాల్పుల విరమణ ప్రకటన వెలువడిన నేపథ్యంలో ప్రపంచ మార్కెట్లో చమురు ధరలు పడిపోయాయి. ముడి చమురు ధరలు 20 శాతం మేర తగ్గాయి. బ్యారెల్‌కు ధర 117.63 డాలర్ల నుంచి 91.05 డాలర్లకు పడిపోయింది. యుద్ధ భయం కారణంగా గత 40 రోజులుగా ముడి చమురు ధరలు ఆకాశాన్నంటుతున్నాయి. కాల్పుల విరమణ ప్రకటన వెలువడిన కొన్ని గంటల్లోనే బ్యారెల్ ముడి చమురు ధర సుమారు 26 డాలర్లు పడిపోయింది. ఏప్రిల్ 2020లో కోవిడ్ మహమ్మారి కారణంగా ప్రపంచవ్యాప్తంగా చమురుకు డిమాండ్ తీవ్రంగా పడిపోయిన తర్వాత ఒక్కరోజులో ఇంత భారీ తగ్గుదల ఇదే మొదటిసారి.
ప్రపంచ చమురు వాణిజ్యంలో ఐదో వంతు జరిగే హోర్ముజ్ జలసంధిపై నెలకొన్న ఆందోళనలు తగ్గడమే ఈ ధరల పతనానికి ప్రధాన కారణం. 40 రోజుల క్రితం ఇజ్రాయిల్-అమెరికా కూటమి ఇరాన్‌పై ఘర్షణను ప్రారంభించింది. దీంతో ఇరాన్ హార్ముజ్ జలసంధిని పూర్తిగా మూసివేసింది. ఇది ప్రపంచ చమురు సరఫరాలపై ప్రభావం చూపి, ధరలు ఆకాశాన్నంటడానికి కారణమై, ప్రపంచవ్యాప్తంగా ఇంధన మార్కెట్లను సంక్షోభంలోకి నెట్టింది. యుద్ధ విరమణ ప్రకటన మార్కెట్‌పై ప్రభావం చూపిన సంక్షోభానికి తాత్కాలిక ఉపశమనం కలిగించింది.
‘కాల్పుల విరమణ’తో ముడి చమురు ధరల పతనం
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



