Sunday, March 8, 2026
E-PAPER
Homeక్రైమ్దారుణం.. విద్యార్థిని విచక్షణారహితంగా కొట్టిన వార్డెన్

దారుణం.. విద్యార్థిని విచక్షణారహితంగా కొట్టిన వార్డెన్

- Advertisement -

నవతెలంగాణ – హైదరాబాద్ : ఖమ్మం నగరంలోని విడివోస్ కాలనీలో ఉన్న రెసోనెన్స్ స్కూల్‌లో దారుణ ఘటన వెలుగుచూసింది. 6వ తరగతి చదువుతున్న విద్యార్థిని స్కూల్ వార్డెన్ విచక్షణారహితంగా కొట్టినట్లు కుటుంబసభ్యులు ఆరోపించారు. వీపు మీద గాయాలు కనిపించడంతో తల్లిదండ్రులు ఆస్పత్రికి తరలించారు. ఘటనపై ఆగ్రహించిన బంధువులు స్కూల్ ఎదుట ధర్నాకు దిగారు. సమాచారం అందుకున్న పోలీసులు అక్కడికి చేరుకుని పరిస్థితిని అదుపులోకి తీసుకువచ్చారు. ఘటనపై దర్యాప్తు కొనసాగుతోంది.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -