- Advertisement -
నవతెలంగాణ – రెంజల్ : రెంజల్ మండలం తాడు బిలోలి గ్రామంలోని సిఎస్సి సర్వీస్ సెంటర్ ను తహసిల్దార్ శ్రవణ్ కుమార్ గురువారం అకస్మికంగా తనిఖీలు చేపట్టారు. కొత్త రేషన్ కార్డుల జారీలో వస్తున్న వదంతుల నేపాధ్యంలో ఈ తనిఖీలను నిర్వహించడం జరిగిందని ఆయన పేర్కొన్నారు. ఇట్టి సర్వీస్ సెంటర్ నిర్వాహకునికి తగు సూచనలను ఇచ్చారు. సర్వీస్ సెంటర్ నియమాల ప్రకారం కొనసాగించాలని సూచించారు. కొత్త రేషన్ కార్డుల జారీలో ఏవైనా ఆరోపణలు వస్తే చట్ట ప్రకారం అట్టి సెంటర్ల పై తగు చర్యలు తీసుకోవడం జరుగుతుందని ఆయన నిర్వాహకులను హెచ్చరించారు.
- Advertisement -