Tuesday, October 28, 2025
E-PAPER
Homeఖమ్మంసిఎస్ఆర్ నిధులను బీటీపిఎస్ నిర్వాసిత గ్రామాల అభివృద్ధికి ఉపయోగించాలి

సిఎస్ఆర్ నిధులను బీటీపిఎస్ నిర్వాసిత గ్రామాల అభివృద్ధికి ఉపయోగించాలి

- Advertisement -

స్థానికులకు ఉపాధి అవకాశాలు కల్పించాలి..
నవతెలంగాణ – మణుగూరు
బి టి పి ఎస్, సి ఎస్ ఆర్ నిధులను బి టి పి ఎస్ నిర్వాసిత గ్రామాల అభివృద్ధికి ఉపయోగించాలని, రోడ్లు, డ్రైనేజీలు, విద్యా, వైద్యం,విద్యుత్తు, త్రాగునీరు తదితర మౌలిక సమస్యలను పరిష్కరించాలని, మణుగూరు నుండి బయ్యారం క్రాస్ రోడ్ వరకు రోడ్డు  నిర్మాణం చేసి ప్రమాదాలు నివారించాలి. స్థానికులకు ఉపాధి అవకాశాలు కల్పించాలని సిపిఐ (ఎంఎల్) మాస్ లైన్  మణుగూరు డివిజన్ కార్యదర్శి ఆర్. మధుసూదన్ రెడ్డి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. 

మంగళవారం పై సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ సిపిఐ (ఎంఎల్) మాస్ లైన్, ప్రజా పందా ఆధ్వర్యంలో బి టి పి ఎస్ గేట్ ముందు ధర్నా నిర్వహించాలి. బి టి పి ఎస్, సి ఈ బిచ్చన్నకు కి వినతి పత్రం ఇవ్వడం జరిగింది.సందర్భంగా ఆయన  మాట్లాడారు. ఈ కార్యక్రమానికి గిరిజన సంఘం నాయకులు చిడం. నాగేశ్వరరావు, వజ్జా. శ్యామ్, కాయం తిరుపతమ్మ సంఘీభావం తెలిపి మాట్లాడారు. ఈ కార్యక్రమంలో  సిపిఐ (ఎంఎల్ )మాస్ లైన్ (ప్రజాపందా) నాయకులు కురసం రామకృష్ణ, ఇందారపు వెంకట్ నర్సయ్య, అలవాల సమ్మన్న, ముషిక. లక్ష్మణ్, రావులపల్లి. ప్రభాకర్, తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -