– సిహెచ్.నరసింగరావు
”మా ప్రాణాలైనా వదులుకుంటాం. కానీ సోషలిజాన్ని వదులుకోం” అనే స్పష్టమైన మాటలు క్యూబాలో వినిపిస్తాయి. ప్రజల్లోని ఆ సోషలిస్టు చైతన్యమే నేటికి క్యూబాలో సోషలిజాన్ని కాపాడు తున్నది. అందరికీ చదువు, అందరికీ పని, అందరికీ ఇళ్ళు, అందరికీ వైద్యం రాజ్యాంగంలోని ప్రాథమిక హక్కులుగా అమలు జరుగుతున్నాయి. పని చేసేవారిలో అసమాతనలు లేవు. డైలీ, క్యాజువల్ పద్ధతుల్లో పనులు ఉండవు. అందరూ పర్మినెంట్ ఉద్యోగులే. ప్రజలంతా ఆరోగ్యంగా వుంటారు. క్యూబా నాటికీ నేటికీ విప్లవ శ్రేణులకు ఎంతో స్ఫూర్తినిస్తుంది. విప్లవవీరుడు, కాస్ట్రో మిత్రుడు చే గువేరా డైరీలో రాసుకున్న చివర వాక్యాలు లాటిన్ అమెరికా గతినే మార్చేశాయి. ‘సాధారణ కుర్రకారుగా బయలుదేరిన చే గువేరా.. నేను ఇంక ప్రజలతోనే వుంటాను. ఎన్ని అడ్డంకులు, ఆటంకాలున్నా దాటుకుంటూ ఎంత మంది గొంతుచించుకొని ఏడ్చినా కసితో నాకు ఎదురుపడ్డ దుర్మార్గపు శత్రువుని కర్కశంగా నా కత్తిపై బలి ఇస్తాను’ అని ముగించారు. క్యూబా తరువాత బొలీవియాలో విప్లవ సాధన తన లక్ష్యంగా ఎంచుకు న్నారు. అమెరికా సామ్రాజ్యవాదులు కుట్రతో చేగువేరా ప్రాణాలను బలిగొన్నారు. క్యూబాలో సోషలిజం అభివృద్ధికి చేగువేరా ఎనలేని కృషి చేశారు. క్యూబా పరిశ్రమల శాఖా మంత్రిగా భారత్‌లో పర్యటిం చారు. భారతదేశం అలీన విధానం పాటించిన కాలంలో భారత్, క్యూబాలు బాగా దగ్గరయ్యాయి.
ఈ రచయిత 2017 మేడే ఉత్సవాలు సందర్భంగా సెంట్రల్ యూనియన్ ఆఫ్ క్యూబన్ వర్కర్స్ (సిటిసి) ఆహ్వానం మేరకు… క్యూబా మేడే ఉత్సవాల్లో పాల్గొన్నారు. ఆ సందర్భంగా ప్రజలను కలసి సోషలిజం గురించి ఎక్కడ చర్చించినా, ”మా ప్రాణాలైన వదులుకుంటాం. కానీ సోషలిజాన్ని వదలుకోం” అనే మాటలు స్పష్టంగా వినిపిస్తాయి. ప్రజల్లోని ఆ సోషలిస్టు చైతన్యమే నేటికి క్యూబాలో సోషలిజాన్ని కాపాడుతున్నది.
ప్రజలకు వైద్య సేవలందించే డాక్టర్ల నిష్పత్తి ప్రపంచంలోనే క్యూబాలో ఎక్కువ. కోవిడ్ కాలంలో క్యూబా ప్రత్యేకత ఏమిటో ప్రపంచమంతా గమనించింది. మానవత్వం అనేది కమ్యూనిస్టులకే సాధ్యమని బ్రిటిష్ షిప్‌లోని కోవిడ్ బాధితులను క్యూబా కాపాడిన తీరు ప్రపంచాన్నే అబ్బురపరిచిం ది. క్యూబా విప్లవానికి 64 సంవత్సరాలు ఘనమైన విప్లవ చరిత్ర వుంది. పక్కలో బల్లెంలాగా వున్న అమెరికా నిరంతరం క్యూబాలో సోషలిజాన్ని కూల్చా లన్న కుట్రలు నేటికీ కొనసాగుతున్నాయి. నేటికీ తీవ్రమైన ఆర్థిక ఆంక్షలు ఉన్నాయి. ప్రాణరక్షణకు వాడే మందులుగానీ, పసిబిడ్డలకు పాల పొడి సైతం పక్క దేశాల్లో కొనుక్కోవడానికి కూడా అమెరికా అను మతించడం లేదు. అయినా సోషలిజాన్ని కాపాడు కుంటూ, వర్గ పోరాట సిద్ధాంతాన్ని నిలబెటు ్టకుంటున్న ఘన చరిత్ర క్యూబాది. దీనికి కారణం ప్రజలను నిత్యం సోషలిస్టు చైతన్యం కల్పించడంలో అత్యంత శ్రద్ధ తీసుకోవడమే. ఆనాటి అమెరికా అధ్య క్షుడు జాన్ కెనడీ క్యూబా అధ్యక్షుడు కాస్ట్రోను ”మీ దేశం మాకు కేవలం వంద కిలోమీటర్ల దూరంలోనే ఉంది. జాగ్రత్త!” అని హెచ్చ రించాడు. ”అమెరికా కూడా మాకు వంద కిలోమీటర్ల దూరంలోనే ఉంది.” అని ఫైడల్ కాస్ట్రో తిరిగి సమాధానం ఇచ్చారు. అదీ, సోషలిస్టు క్యూబా ధైర్యం!
ఎన్ని కుతంత్రాలు చేసినా సోషలిజాన్ని కూల్చడం అమెరికా తరం కాలేదు. భవిష్యత్‌లో కూడా కాబోదు. మేము 2017లో క్యూబాలో పర్యటిస్తున్న సందర్భంగా ప్రభుత్వం ప్రవేశపెట్టిన రాజ్యాంగ సవరణలు దేశమంతా ప్రజల్లో ప్రత్యేకంగా చర్చ జరుగుతున్న కాలం. ప్రభుత్వం చేపట్టే ప్రతి పని ప్రజల్లో చర్చించి, పార్టీ ద్వారా నిర్ణయాలు చేస్తుంటారు. ప్రజలు ఆ నిర్ణయాన్ని తమ సొంత నిర్ణయంగా పాటిస్తారు. వేల కిలోమీటర్ల దూరంలో వున్న ఇరాన్, ఇరాక్, ఆఫ్ఘనిస్థాన్‌లో ప్రజలను చీల్చి, సైన్యాన్ని పంపి అమెరికా కూల్చగలిగింది. రష్యా, యూరప్ దేశాల్లో కుట్రలు పన్ని సోషలిజాన్ని పడగొట్టింది. ఆనాడే గోర్బచెవ్ చేపట్టిన గ్లాస్‌నాస్త్, పెరిస్ట్రోయకా విధానాలను కాస్ట్రో తప్పుపట్టారు. వర్గ సంకర విధానాల వల్ల రష్యాలో సోషలిజం దెబ్బతింటుందని ముందుగానే కాస్ట్రో హెచ్చరించారు.
క్యూబాలో సోషలిస్టు చైతన్యం సామ్రాజ్యవాద వ్యతిరేక పునాదులపై నిర్మించబడింది. నేటికీ సోషలిస్టు చైతన్యం చెక్కు చెదరకుండా కొనసాగుతున్నది. అమెరికా కుట్రలు ఎక్కడైనా సాగాయి కానీ, క్యూబాలో సాగలేదు. సోషలిజం నేటికి అజేయంగా కొనసాగుతోంది.
‘ఇరాన్ తర్వాత మా లక్ష్యం క్యూబానే’ అంటూ అమెరికా అధ్యక్షుడు ట్రంప్ బెదిరింపు ప్రకటనలు చేస్తున్నారు. దీనికి వ్యతిరేకంగా క్యూబా రాజధాని హవానాలో లక్షలాది ప్రజలు తీవ్ర నిరసన తెలిపారు. 67 సంవత్సరాలుగా క్యూబాపై ఎన్ని కుట్రలు చేసినా అమెరికా ఓడించలేకపోయింది. ఇకపై కూడా ఓడించలేరని క్యూబా ప్రభుత్వం ప్రకటించింది. 1959లో క్యూబా విప్లవం జయప్రదమైంది. క్యూబా వ్యవసాయ దేశం.
చెరకు మాత్రమే పండుతుంది. ఇతర ఆదాయం ప్రధానంగా టూరిజం మాత్రమే! కోవిడ్ కాలంలో టూరిజం పూర్తిగా పడిపోయింది. రష్యాలో 1992లో సోషలిజం కూలిపోయిన తరువాత దానితో సంబంధాలు తెగిపోయాయి. ఆహార కొరత ఏర్పడింది. భారతదేశం నుంచి వేల టన్నుల ఆహారధాన్యాలు భారత, క్యూబా సంఘీభావ కమిటీ ఆధ్వర్యాన హవానా పోర్టుకు చేరాయి. ఆ సందర్భంగా ఫైడల్ కాస్ట్రో భారత్ నుంచి వేల టన్నుల గోధుమలు మాత్రమే కాదు; అంతకంటే లక్షల టన్నుల ప్రజల సంఘీభావం అందిందని అభివర్ణించారు. నేడు అమెరికా దిగ్బంధంలో ఉన్న క్యూబాకు సంఘీభావంగా విరాళాలిద్దాం.
విప్లవ కర్తవ్యాలను నేటికీ కొనసాగిస్తున్న క్యూబా
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



