నవతెలంగాణ – గాంధారి
ప్రభుత్వ భూముల్లో యాడెచ్చగా ఫామ్ ఆయిల్ పంటను వేసుకుంటున్నారని సీపీఐ(ఎం) ఆధ్వర్యంలో ఎల్లారెడ్డి ఆర్ డి ఓ కు ఫిర్యాదు చేయడం జరిగింది. గాంధారి మండలంలోని మతు సంగెం సర్వే నంబర్ 119, 175 లో గత 10 ఏళ్ల నుంచి సాగు చేసుకుంటున్న దళిత గిరిజనులను వెళ్ళ గొట్టి అక్కడున్న భూస్వాములు 60 ఎకరాల భూమిని భయపెట్టి గుంజుకున్నారు. ఇప్పుడు అట్టి భూములో పామాయిల్ తోట వేసుకుంటుండగా ప్రభుత్వ అధికారులు హెచ్చరించిన కూడా వందల ఎకరా భూములను వాళ్లస్వాధీనంలో చేసుకోవడం ప్రభుత్వ చేతకాని త నం అన్నారు. మూడు రోజుల క్రితమే జెసి ఆదేశాల మేరకు ఆర్డిఓ కూడా ఆ భూమిని సందర్శించడం జరిగింది. ప్రాజెక్ట్ సర్వే చేస్తానని కూడా అన్నారు. ఆ భూమిని ఎవరు కూడ దున్నుకోవద్దని హెచ్చరించారు. ఆ హెచ్చరిక ను కూడా బేఖాచారు చేస్తుంటే చూస్తూ ఎలా ఊరుకుంటారని అన్నారు. ప్రభుత్వం స్పందించక పోతే సీపీఐ(ఎం) ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఆందోళన చేపడుతామని నాయకులు అన్నారు. ఈ కార్యక్రమంలో మధు, ప్రకాష్ లు తదితరులు పాల్గొన్నారు.
ప్రభుత్వ భూముల్లో యధేచ్చగా పంటసాగు: సీపీఐ(ఎం)
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES