Sunday, March 8, 2026
E-PAPER
Homeరాష్ట్రీయంకులరహిత సమాజానికి సాంస్కృతికోత్సవాలు

కులరహిత సమాజానికి సాంస్కృతికోత్సవాలు

- Advertisement -

– గద్దర్‌ అవార్డు గ్రహీత సుద్దాల అశోక్‌ తేజ, ఎస్‌వీకే కార్యదర్శి ఎస్‌. వినయకుమార్‌
నవతెలంగాణ – ముషీరాబాద్‌

కులరహితం-సమాజ రహితం సాంస్కృతికోత్సవాలు నిర్వహిస్తామని జాతీయ సినీగేయ రచయిత, గద్దర్‌ అవార్డు గ్రహీత సుద్దాల అశోక్‌ తేజ, ఎస్‌వీకే కార్యదర్శి ఎస్‌. వినయకుమార్‌ తెలిపారు. సాంస్కృతికోత్సవాల సన్నాహాక సమావేశం టీపీఎస్‌కే అధ్యక్షులు భూపతి వెంకటేశ్వర్లు అధ్యక్షతన శనివారం సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో జరిగింది. ఈ సందర్భంగా జాతీయ సినిగేయ రచయిత మాట్లాడుతూ కుల వ్యవస్థ మను షులను సామాజికంగా, ఆర్థికంగా అసమాన దొంతరులుగా విభజిం చిందని, అందుకే సామాజిక పీడనకు సాధనంగా ఉందన్నారు. విద్యాల యాల నుంచి రాజకీయాల వరకు, బడి నుంచి గుడి వరకు, పుట్టుక నుంచి చావు వరకు వివక్ష రూపాలు కొనసాగుతున్నాయన్నారు. ఎస్‌వీకే కార్యదర్శి వినయకుమార్‌ మాట్లాడుతూ బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత మనువాద భావజాలం విస్తరిస్తోందని, కులవివక్ష కొత్త రూపాలు సంతరిం చుకుంటున్నదని, వివక్ష, దాడులు అనేక రేట్లు పెరిగాయని తెలిపారు. గతంలో ఎన్నడూ లేని విధంగా తెలంగాణలో దశాబ్ద కాలంలోనే 175 కుల దురహంకార హత్యలు నమోదయ్యాయని, సోషల్‌ మీడియాలో ట్రోలింగ్‌ సంస్కృతి పెరుగుతున్నదని, కల్చరల్‌ డామినేషన్‌, సింబాలిక్‌ వయలెన్స్‌ పెంచి పోషిస్తున్నారన్నారు. అందుకే కుల నిర్మూలన సాంస్కతికోత్సవాల్లో భాగంగా సిగేచర్‌ క్యాంపెయిన్‌, ఆర్ట్‌ ఎగ్జిబిషన్‌, కవి సమ్మేళనాలు, సినీ, జానపద పాటల కచేరి, షార్ట్‌ ఫిలిం పోటీలు, నృత్య నీరాజనాలు, డప్పు విన్యాసాలు, పుస్తక ప్రదర్శనలు, నాటికలు, వ్యాసరచన పోటీలు, నగరంలో కళారూపాలు, కళాకారుల సర్వేలు, కులనిర్మూలన ప్రతిజ్ఞలు, మారథాన్‌ పరుగులు ఇలా అనేక రక రకాలు కార్యక్రమాలు ప్రదర్శించాలన్నారు. కుల నిర్మూలన సంఘం వహీద్‌ జ్యోతి, జోత్స్న మాట్లాడుతూ. ఈ కుల నిర్మూలన సాంస్కతికోత్సవాలకు పెద్ద ఎత్తున సహకరిస్తామని అన్నారు. మానవ వికాస కేంద్రం సాంబశివరావు మాట్లాడుతూ కులం పునాదుల మీద ఒక జాతిని గానీ, ఒక నీతిని గానీ నిర్మించలేమన్న అంబేద్కర్‌ మాటలను గమనంలో ఉంచుకోవాలన్నారు. టీపీఎస్‌కే గౌరవ అధ్యక్షులు జి.రాములు మాట్లాడుతూ స్వకుల వివా హాలను రద్దు చేయాలన్నారు. తెలంగాణ సాహితి ఆనందచారి మాట్లాడుతూ తెలంగాణ గడ్డపై కులరహిత సమాజం కోసం మేధావులు, ప్రజాసంఘాలు, సామాజిక సంఘాలు, సంస్థలు, సాహితీవేత్తలు, కవులు, కళాకారులు ఒక తాటిపైకి రావాల్సిన అవసరం ఏర్పడిందన్నారు. నో క్యాస్ట్‌ ఇండియా నాయకులు విప్లవ్‌, డీబీఎఫ్‌ జాతీయ కార్యదర్శి పి శంకర్‌, కళా కారుల సంఘం నాయకులు గడ్డం సుధాకర్‌, విజ్ఞాన దర్శిని రమేష్‌, కవి రచయిత సాధనాల వెంకటస్వామి, భారత నాస్తిక సంఘం ప్రశాంత్‌, జర్నలిస్ట్‌ కంబాలపల్లి కష్ణ, జగతి ఆర్ట్స్‌ ఆర్‌ సైదులు, శ్రీనివాస్‌ బహుదుర్‌, పెండ్యాల మధుసుధన్‌, సామిడి జగన్‌ రెడ్డి తదితర నాయకులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -