No menu items!
Monday, August 25, 2025
E-PAPER
spot_img
No menu items!
Homeట్రెండింగ్ న్యూస్ప్రణాళికాయుతంగాకల్వర్ట్‌ పనులు పూర్తి చేయాలి

ప్రణాళికాయుతంగాకల్వర్ట్‌ పనులు పూర్తి చేయాలి

- Advertisement -

హైడ్రా కమిషనర్‌ రంగనాథ్‌
లింగంపల్లి వద్ద బాక్స్‌ కల్వర్ట్‌ పనుల పరిశీలన
నవతెలంగాణ-శేరిలింగంపల్లి

రంగారెడ్డి జిల్లా శేరిలింగంపల్లి డివిజన్‌ లింగంపల్లి రైల్వే అండర్‌ బ్రిడ్జి వద్ద వరద ముంపు సమస్య శాశ్వత పరిష్కారం దిశగా యుద్ధప్రతిపాదికన చేపడుతున్న బాక్స్‌ కల్వర్ట్‌ పనులను త్వరితగతిన పూర్తి చేయాలని హైడ్రా కమిషనర్‌ రంగనాథ్‌ అన్నారు. బుధవారం వరద నీటి కాల్వ నిర్మాణ పనులను కార్పొరేటర్‌ రాగం నాగేందర్‌యాదవ్‌, జీహెచ్‌ఎంసీ ఇంజినీరింగ్‌ అధికారులు డీఈ ఆనంద్‌, ఏఈ భాస్కర్‌తో కలిసి రంగనాథ్‌ పరిశీలించారు. ఈ సందర్భంగా రంగనాథ్‌ మాట్లాడుతూ.. లింగంపల్లి అండర్‌ బ్రిడ్జి వరద నీటితో నిండిపోవడం వలన పరిసర ప్రాంత వాహనదారులకు, ప్రయాణికులకు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని తన దృష్టికి కార్పొరేటర్‌ తీసుకువచ్చారని తెలిపారు. ఈ సమస్యకు శాశ్వత పరిష్కారం దిశగా ఎమ్మెల్యే గాంధీ చొరవతో అండర్‌ బ్రిడ్జి నుంచి వరద నీటి కాల్వ, బాక్స్‌ కల్వర్ట్‌ నిర్మాణం పనులు చేపడుతున్నామన్నారు. పనులు త్వరితగతిన పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకువచ్చి ముంపు సమస్య పునరావృతం కాకుండా చర్యలు చేపడుతున్నామన్నారు. గోపీచెరువులో ఉన్న మురికి నీటిని తొలగించాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. తద్వారా డ్రయినేజీ నీరు చెరువులో నిలవకుండా ఉంటుందని తెలిపారు. డ్రయినేజీ నీటితో చెరువులో గుర్రపుడెక్క పేరుకుపోయిందని చెప్పారు. సమస్య పరిష్కారానికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో హైడ్రా సంబంధిత అధికారులు, సందయ్యనగర్‌ అధ్యక్షులు బస్వరాజ్‌, గోపినగర్‌ బస్తీ అధ్యక్షులు గోపాల్‌యాదవ్‌, నటరాజ్‌, స్థానికవాసులు తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
spot_img
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -spot_img
Ad
Ad