Tuesday, August 12, 2025
E-PAPER
spot_img
Homeరాష్ట్రీయంరేకుల ఇంటికి రూ.9073 కరెంట్‌ బిల్లు

రేకుల ఇంటికి రూ.9073 కరెంట్‌ బిల్లు

- Advertisement -

– ఓ యజమాని ఆందోళన
– మెదక్‌ జిల్లా చేగుంట మండలం సీఎంఆర్‌ కాలనీలో ఘటన
నవతెలంగాణ-చేగుంట

మెదక్‌ జిల్లా చేగుంట మండలం సీఎంఆర్‌ కాలనీలో ఉంటున్న నూతన కంటి అరుణ రేకుల ఇంటికి మే నెలలో రూ.9073 కరెంట్‌ బిల్లు వచ్చింది. దాంతో ఆ ఇంటి యజమాని అరుణ ఆందోళనకు గురైంది. సోమవారం ఆమె స్థానిక విలేకరులను ఆశ్రయించి తన గోడును వెళ్లబోసుకుంది. ఆమె తెలిపిన వివరాల ప్రకారం.. సీఎంఆర్‌ కాలనీలో తనకు ఉన్న రేకుల ఇంటిలో సర్వీస్‌ నెంబర్‌. 22004660 గల మీటర్‌కు కొన్ని నెలలుగా జీరో బిల్లు వస్తుందని తెలిపింది. కాగా, మే 5వ తేదీన అదే ఇంటికి కరెంటు బిల్లు రూ.9073 వచ్చిందని ఆందోళన వ్యక్తం చేసింది. రేవంత్‌ రెడ్డి ప్రభుత్వంలో 200 యూనిట్ల వరకు ఉచిత కరెంటు అమలవుతుండగా తమకు ఇంత బిల్లు రావడం ఏంటని ఆవేదన వ్యక్తం చేసింది. అధికంగా కరెంట్‌ బిల్లు రావడంపై స్థానిక కరెంటు లైన్‌మెన్‌ను అడగగా బిల్లు కట్టకుంటే కరెంటును తొలగిస్తానని బెదిరిస్తున్నాడని వాపోయింది. తక్షణమే అధికారులు జోక్యం చేసుకుని తనకు న్యాయం చేయాలని కోరింది. దీనిపై విద్యుత్‌ ఏఈ వంశీని ఫోన్‌లో వివరణ కోరగా.. లెటర్‌ పెడతామని, తప్పకుండా బిల్లు తగ్గేలా చూస్తామని తెలిపారు. ఒక్కోసారి మీటర్ల దగ్గర ఉన్న వైరు సమస్య వల్ల ఇలా జరుగుతుందని, పరీక్షించి ఆమెకు న్యాయం చేస్తామని అన్నారు.

- Advertisement -
spot_img
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -spot_img