నిందితులను అదుపులోకి తీసుకున్న రామగుండం సైబర్ క్రైం పోలీసులు
నవతెలంగాణ – మంచిర్యాల
జన్నారం కేంద్రంగా సైబర్ క్రైం మోసాలకు పాల్పడుతున్న వ్యక్తులను రామగుండము సైబర్ క్రైమ్ పోలీసులు టెలికమ్యూనికేషన్ డిపార్ట్మెంట్ సహాయం తో అదుపులోకి తీసుకున్నారు. బుధవారం జిల్లా కేంద్రం లోని డిసిపీ కార్యాలయం లో ఏర్పాటు చేసిన పత్రిక సమావేశం లో మంచిర్యాల డిసిపీ ఎగ్గడి భాస్కర్ నిందితుల వివరాలు వెల్లడించాడు.జగిత్యాల జిల్లా లక్ష్మీపూర్ గ్రామానికి చెందిన బావు బాపయ్య అనే వ్యక్తి బ్రతుకు దేరువు కోసమని గతం లో కంభోడియా దేశానికి వెళ్లి పని చేసే వాడు. అక్కడికి వెళ్లే క్రమం లో చండిగడ్ రాష్ట్రం లో సాయికృష్ణ ( జాక్) అనే వ్యక్తిని కలిశాడు. తరువాత బాపయ్య కంభోడియా వెళ్లి ఒక రెస్టారెంట్ లో పని చేస్తున్న సమయం లో సాయికృష్ణ అక్కడికి వెళ్లి డిన్నర్ చేసి కాసేపు అతనీతో మాట్లాడి వెళ్లి పోతాడు.
2025 ఏప్రిల్ లో భాపయ్య తిరిగి ఇండియా కు వచ్చాడు.సాయి కృష్ణ, బాపయ్య ల మధ్య ఏర్పడిన స్నేహం తో అనుకోకుండా ఒక రోజు సాయి కృష్ణ బాపయ్య కు వాట్సప్ ద్వారాకాల్ చేసి జన్నారం ప్రాంతం లో ఒక అద్దె ఇల్లు ఏర్పాటు చేయాలనీ తెలుపగ అతనికి తెలిసిన వారి ఇల్లు ఒకటి అద్దెకు తీసుకుంటాడు. ఒకరోజు బాపయ్యకు సాయి కృష్ణ కాల్ చేసి జగిత్యాల బస్టాండ్ కు ఒక వ్యక్తి వస్తాడు అతని దగ్గర ఉన్న వస్తువులు తీసుకొని వాటిని జన్నారం లోని అద్దె గది లో పెట్టమంటాడు. సాయి కృష్ణ చెప్పినట్లు బాపయ్య చేస్తాడు.అనంతరం ఫైబర్ నెట్ కనెక్షన్, పలు రకాల సిం కార్డు లు.ల్యాప్ టాప్స్, డి లింక్ రూటర్ లు, కొనుగోలు చేసిన అనంతరం సాయికృష్ణ తనకు తెలిసిన మరి కొందరు వ్యక్తులు అయిన రాజు, మధుకర్, రాజేష్, కామేష్ లను ఇక్కడ పని చేసేందుకు నియమించు కుంటారు.విటన్నిటికీ ఖర్చు లు సాయి కృష్ణ భరించగ, అదే అద్దె ఇంట్లో నుండి సైబర్ క్రైం పనులు మొదలు పెడతారు.
వారి పని అంత సాయి కృష్ణ చెప్పింది చేయడం. ఏపీకే లింక్ లు, బాధితులను బయపెట్టి వారి నుండి డబ్బులు గుంజడం, మరి కొందరికి డబ్బు ఆశ చూపి పెట్టు బడి పెట్టియడం,ఫెక్ ఐడి, ఫెక్ అప్లికిషన్స్ తయారు చేసి , సిం కార్డు నెంబర్ లను మారుస్తూ ఆన్లైన్ మోసలకు పాల్పడడం లాంటివి చేసే వారు.గత నెల రోజులుగా జన్నారం లో జరుగుతున్న ఈ సైబర్ క్రైం మోసలకు సంబంధించి విశ్వాసనియా సమాచారం అందుకున్న రామగుండం సైబర్ క్రైమ్ పోలీసులు జన్నారం లో విస్తృత తనిఖీలు చేపట్టి అద్దె ఇంట్లో ఈ సైబర్ క్రైమ్ మోసలకు పాల్పడుతున్న యండ్రపు కామేష్, పార్వతి పురం, మన్యం జిల్లా ఆంధ్రప్రదేశ్, బావు బాపయ్య, లక్ష్మీపూర్, బావు మధుకర్ లక్ష్మీపూర్ జగిత్యాల జిల్లా గొట్ల రాజేష్ కిష్టపూర్ జన్నారం కు చెందిన వ్యక్తులను అదుపులోకి తీసుకొని రిమాండ్ కు తరలించినట్లు తెలిపారు.
వారి వద్ద నుండి పలు కంపెనీ లకు చెందిన 232 సిం కార్డు లు, మొబైల్ ఫోన్స్, సిం ప్యానెల్స్, మోడెమ్, డి లింక్ రూటర్ లు, ఫైబర్ బాక్స్ లు, మరి కొన్ని కేబుల్ నెట్ వర్క్ ప్యానెల్స్ ను స్వాదినం చేసుకున్నట్లు తెలిపారు. పరారిలో ఉన్న మరి కొంత మందిని కూడా అదుపులోకి తీసుకుంటాం అన్నారు.జన్నారం కేంద్రం గా కొనసాగుతున్నా సైబర్ క్రైం నేరగాళ్ళను అదుపులోకి తీసుకోవడం లో చాక చక్యంగా విధులు నిర్వర్తించిన రామగుండం కమిషనరేట్ సైబర్ క్రైం డి ఎస్ పి వెంకట రమణ రెడ్డి, మంచిర్యాల ఏసీపి ఆర్ ప్రకాష్, లక్షేట్టిపేట సీఐ రమణ మూర్తి, సైబర్ క్రైం ఇన్స్పెక్టర్ కృష్ణమూర్తి, సీఐ శ్రీనివాస్,ఎస్ ఐ తహసీనొద్దిన్, అనూష, సురేష్ వారికి సహకరించిన టె లికమ్యూనికేషన్ సిబ్బంది ని డిసిపీ అభినంధించి రివర్డ్ లు అందించారు.
జన్నారంలో సైబర్ క్రైం మోసాలు
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES