Monday, September 22, 2025
E-PAPER
Homeదర్వాజసైబర్‌ నేర గాళ్ళు

సైబర్‌ నేర గాళ్ళు

- Advertisement -

నా నుండి సంతోషాలని, దుఃఖాన్ని
డ్రా చేస్తున్నప్పుడల్లా
చిరు నవ్వులోనే వున్నాను
శ్రమ అనే ఎకౌంట్‌ నుండి
ఎన్ని స్వేదబిందువులు ఖాళీ అవుతున్నా
వెలుగు దీపం తైలం అడుగంటి పోనివ్వలేదు
రెప రెపలు జ్ఞాపకంగానే వున్నాయి
నా ఎకౌంట్‌ నిండా ఫ్రెష్‌గా జమ అవుతున్న
చీమూ, నెత్తురు కూడటం తెలియని వాడిని
జేబు జల్లెడ మాదిరి ఖాళీ రిక్త హస్తమే
నా అంతటి వారు మీరియ్యాల అయ్యక
ప్రైవసీలు, లెక్కల దాపరికాలు
మూలన గిరాటేసిన చిల్లులు పడ్డ
గొనె సంచి లాగ మీ చూపులు
నన్ను జల్లెడ పడుతున్నాయి
మీరు సైబర్‌ నేరాగాళ్ళుగా నా శ్రమను దోస్తున్నప్పుడు
నాకేమీ బాధ అనిపించ లేదు
కొడుకుల నుండి పౌరులుగా ఎదుగుతున్నప్పుడు
ఇప్పుడు బాధల మూట
ముడులు వీడుతుంది .

  • హనీఫ్‌
- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -