Friday, April 10, 2026
E-PAPER
Homeరాష్ట్రీయం'వికసిత్‌ భారత్‌' పేరిట సైబర్‌ మోసం

‘వికసిత్‌ భారత్‌’ పేరిట సైబర్‌ మోసం

- Advertisement -

జనగామ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్‌ రెడ్డి నుంచి రూ.లక్ష కాజేసిన వైనం
నవతెలంగాణ-జనగామ

సైబర్‌ మోసగాళ్లు రోజురోజుకూ కొత్త కొత్త పద్ధతులతో ప్రజలను మోసం చేస్తున్నారు. జనగామ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్‌ రెడ్డి కూడా వారి బారిన పడిన ఘటన వెలుగులోకి వచ్చింది. ‘వికసిత్‌ భారత్‌’ పథకం పేరుతో నమ్మబలికిన ఒక నిందితుడు ఎమ్మెల్యేను సంప్రదించి, వికసిత భారత పథకం అర్హుల జాబితా అందిస్తే ఒక్కొక్కరికి రూ.10 లక్షల రుణాలు మంజూరు అవుతాయని నమ్మబలికాడు. ఈ మాటలను నమ్మిన ఎమ్మెల్యే, తన పరిధిలోని లబ్దిదారుల కోసం ముందడుగు వేశారు.

రుణాల ప్రాసెసింగ్‌ ఫీజు పేరుతో ఒక్కొక్కరికి రూ.2,500 చొప్పున అవుతుందని చెప్పాడు. దాంతో ఎమ్మెల్యే ఒక్కొక్కరికి రూ. 2500 చొప్పున మొత్తం రూ.1 లక్ష ఫోన్‌ పే ద్వారా చెల్లించారు. తర్వాత మళ్లీ డబ్బులు కోరడంతో ఎమ్మెల్యేకు అనుమానం వచ్చి అసలు విషయం బయటపడింది. దాంతో ఇది సైబర్‌ మోసం అని ఎమ్మెల్యే గుర్తించి వెంటనే జూబ్లీహిల్స్‌ సైబర్‌ క్రైమ్‌ పోలీసులను ఆశ్రయించి ఫిర్యాదు చేశాడు. అప్రమత్తమైన పోలీసులు ఆ మొత్తాన్ని సంబంధిత మోసగాడి ఖాతా నుంచి మరో ఖాతాకు ట్రాన్స్‌ఫర్‌ కాకుండా డబ్బులను కాపాడినట్టు సమాచారం.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -