నవతెలంగాణ-బెజ్జంకి
అప్రమత్తతోనే సైబర్ నేరాలపు నియంత్రణ సాధ్యమని ఏఎస్ఐ ఓదేలు ప్రజలకు సూచించారు. శనివారం మండల కేంద్రంలోని గ్రామ పంచాయతీ కార్యాలయం వద్ద ఎస్ఐ సౌజన్య అధేశానుసారం పోలీసులు స్థానికులకు సైబర్ నేరాల నియంత్రణ, మత్తుపదార్థాలు,బాల కార్మికుల నిర్మూలన,మానవ అక్రమ రవాణ నివారణపై అవగాహన కల్పించారు. హెడ్ కానిస్టెబుల్ కనుకయ్య,సుధాకర్ రెడ్డి, కానిస్టెబుల్లు రవి,శ్రీను పాల్గొన్నారు.
రోడ్లపై ధాన్యం ఆరబోయద్దు..
రైతులు తమ పంట ధాన్యాన్ని రోడ్లపై ఆరబోయవద్దని పోలీసులు సూచించారు. వీరాపూర్ గ్రామంలో రోడ్లపై ధాన్యం ఆరబోసిన రైతులకు అవగాహన కల్పించారు. రోడ్లపై ధాన్యం ఆరబోసి వాహనాదారుల ప్రమాదాలకు కారణమవ్వద్దని పోలీసులు సూచించారు. రైతులు తమ పంట పోలాల వద్దనే ధాన్యం ఆరబోయాలని కోరారు. కానిస్టెబుల్లు రవి,శ్రీను పాల్గొన్నారు.



