Tuesday, September 23, 2025
E-PAPER
Homeఖమ్మంపన్నెండో రోజుకి చేరిన దినసరి కార్మికులు సమ్మె

పన్నెండో రోజుకి చేరిన దినసరి కార్మికులు సమ్మె

- Advertisement -

– ఐక్యతతోనే హక్కుల సాధన
– మద్దతుగా మాట్లాడిన సీపీఐ(ఎం) నేత చిరంజీవి
నవతెలంగాణ – అశ్వారావుపేట 

ఐక్యతతో నే కార్మికులు,శ్రామికులు తమ హక్కులు సాధించినట్లు చరిత్ర చెప్తుందని సీపీఐ(ఎం) జోల్లా కమిటీ సభ్యులు బి.చిరంజీవి అన్నారు.

ఆశ్రమ పాఠశాలలు,వసతి గృహాల్లో పనిచేసే దినసరి కార్మికులు చేపట్టిన సమ్మె 12 వ రోజుకు చేరుకున్న సందర్భంగా మంగళవారం ఆయన సమ్మెను ప్రారంభించి కార్మికులు నుద్దేశించి మాట్లాడారు.అనంతరం దినసరి కార్మికులు తమ సమస్యలు పరిష్కరించాలని స్థానిక అంబేద్కర్ విగ్రహానికి వినతి పత్రం సమర్పించారు. కార్మికులు కోరుతున్నది గొంతెమ్మ కోరికలు కావని ఇస్తున్న వేతనాలను తగ్గించ వద్దు అని సమ్మె చేస్తుంటే కార్మికుల ఆకలి కేకలు ప్రభుత్వానికి వినిపించక పోవడం దురదృష్టకరమని ఆయన అన్నారు. 

సీపీఐ ఎం ఎల్ ఎన్డీ ప్రజాపంథా జిల్లా నాయకులు గోకినపల్లి ప్రభాకర్ సమ్మె శిబిరాన్ని సందర్శించి దినసరి కార్మికుల సమ్మెకు తన పార్టీ సంపూర్ణ మద్దతు ప్రకటిస్తుందని మద్దతుగా మాట్లాడారు. ఈ కార్యక్రమంలో సీపీఐ(ఎం) జిల్లా నాయకులు దొడ్డ లక్ష్మీనారాయణ,మోరంపుడి శ్రీనివాసరావు,మండల కార్యదర్శి వర్గ సభ్యులు మడిపల్లి వెంకటేశ్వరరావు,దమ్మపేట నాయకులు మురహరి రఘు,యూనియన్ నాయకులు కరుణాకర్,సుబ్బు,ఆదిలక్ష్మి, నాగమణి,చంద్రం,వెంకన్న తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -