- Advertisement -
నవతెలంగాణ – చారకొండ
మండలంలోని జూపల్లి గ్రామం శుక్రవారం గూడూరు కిరణ్ వ్యవసాయ పొలంలో పాడి ఆవు మేతకు వెళ్లి ప్రమాదవశాత్తు విద్యుత్ ట్రాన్స్ఫారం తగిలి మృతి చెందింది. సుమారు ఆవు విలువ రూ. 1.30 వేలు ఉంటుందని రైతు కిరణ్ తెలిపాడు. ఆవు మృతి చెందడంతో తమ కుటుంబం రోడ్డున పడిందని ఆవేద వ్యక్తం చేశాడు. ప్రభుత్వం స్పందించి తన కుటుంబాన్ని ఆదుకోవాలని కిరణ్ కోరారు. ఆవు మృతి చెందిన సమాచారం తెలుసుకోవడంతో విద్యుత్ అధికారులు వైద్య అధికారులు అక్కడి చేరుకొని ప్రమాద స్థలాన్ని పరిశీలించారు.
- Advertisement -