- Advertisement -
నవతెలంగాణ – అచ్చంపేట
అమ్రాబాద్ మండలం వటవర్లపల్లి గ్రామంలో బిఎస్ఎన్ఎల్ టవర్ ట్రాన్స్ఫార్మర్ దగ్గర బుధవారం ఇదే గ్రామానికి చెందిన హుస్సేన్ కు చెందిన పాడి ఆవు విద్యుత్ షాక్ తో మృత్యువాత పడింది. బిఎస్ఎన్ఎల్ టవర్ ట్రాన్స్ఫారం దగ్గర రక్షణగా పెట్టాల్సిన కంచ ఏర్పాటు చేయకపోవడం తో దాదాపు 50 వేల రూపాయల గల పాడి ఆవు విద్యుత్ షాక్ తో చనిపోయింది. దీనికి బాధ్యత వహించి టవర్ యజమానులు రైతుకు నష్టపరిహారం చెల్లించాలని ఆవు యజమాని హుస్సేన్ ఆవేదనతో డిమాండ్ చేశారు.
- Advertisement -



