Thursday, September 25, 2025
E-PAPER
Homeబీజినెస్దలాల్‌ స్ట్రీట్‌ నేల చూపులు

దలాల్‌ స్ట్రీట్‌ నేల చూపులు

- Advertisement -

నాలుగో రోజూ మార్కెట్ల పతనం
ముంబయి : దలాల్‌ స్ట్రీట్‌లో తీవ్ర నిరాశలు నెలకొన్నాయి. వరుస అమ్మకాల ఒత్తిడితో మార్కెట్లు నేల చూపులు చూస్తున్నాయి. ట్రంప్‌ టారిఫ్‌లు, హెచ్‌1బీ వీసాలపై ఆందోళనలు ఇన్వెస్టర్లను తీవ్ర ఆందో ళనకు గురి చేస్తోన్నాయి. ఈ పరిణా మాల నేపథ్యంలో వరుసగా నాలుగో రోజూ సూచీలు పతనమయ్యాయి. ముఖ్యంగా ఫైనాన్షియల్‌, ఐటీ షేర్లు అమ్మకాల ఒత్తిడితో బుధవారం బీఎస్‌ఈ సెన్సెక్స్‌ 386 పాయింట్లు లేదా 0.47 శాతం కోల్పోయి 81,716కు పడిపోయింది. ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ 113 పాయింట్లు లేదా 0.45 శాతం తగ్గి 25,057కు పరిమితమయ్యింది. సెన్సెక్స్‌ 30 సూచీలో టాటా మోటార్స్‌, బిఇఎల్‌, అల్ట్రాటెక్‌ సిమెంట్‌, టెక్‌ మహీంద్రా, మహీంద్రా అండ్‌ మహీంద్రా షేర్లు అధిక నష్టాలను చవి చూడగా.. పవర్‌గ్రిడ్‌ కార్పొరేషన్‌, హిందుస్థాన్‌ యూనిలీవర్‌, ఎన్‌టీపీసీ, మారుతీ సుజుకీ, హెచ్‌సిఎల్‌ టెక్నాలజీస్‌ షేర్లు లాభపడిన వాటిలో ఉన్నాయి. నిఫ్టీ మిడ్‌ క్యాప్‌ 0.98 శాతం, స్మాల్‌ క్యాప్‌ 0.67 శాతం చొప్పున నష్టపోయాయి.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -