నవతెలంగాణ – కామారెడ్డి
మహాత్మా గాంధీ ఉపాధి హామీ పథకం పేరు మారుస్తున్నామని కేంద్ర మంత్రి అమిత్ షా చేసిన వాక్యాలను ఖండిస్తున్నామని దళిత బహుజన ఫ్రంట్ నాయకులు అన్నారు. 76వ భారత రాజ్యాంగ దినోత్సవాన్ని పురస్కరించుకొని భారత రాజ్యాంగ హక్కుల పరిరక్షణ కార్యక్రమంలో భాగంగా శుక్రవారం కామారెడ్డి జిల్లా బిబిపేట్ మండల కేంద్రంలో అంబేద్కర్ చౌరస్తా వద్ద దళిత బహుజన ఫ్రంట్ ఆధ్వర్యంలో కేంద్ర ప్రభుత్వం మహాత్మ ఉపాధి హామీ పథకం పేరు మారుస్తున్నాం అని కేంద్ర శాఖ మంత్రి అమీత్షా చేసిన వాక్యాలను ఖండిస్తూ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని అలాగే ఉంచాలని అన్నారు.
ప్రతి కుటుంబానికి వందరోజుల పనిని కల్పించే సమాన హక్కు ఉండే ఈ పథకం ఇప్పటికే కుధిస్తున్నారనీ, పేరు మారిస్తే ఆందోళన చేపడతామని దళిత బహుజన ఫ్రంట్ రాష్ట్ర నాయకులు తలారి ప్రభాకర్ డిమాండ్ చేశారు. ఇప్పటికైనా కేంద్ర మంత్రి మాటల్ని వెనుక తీసుకొని మతతత్వాలను రెచ్చగొట్టే ప్రయత్నాలను మానుకోవాలన్నారు. కులం, మతం పేరు పైన కేంద్ర ప్రభుత్వం చేసే కుట్రలను ఖండిస్తూ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని వేగవంతం చేయాలని, ప్రతి కూలీలకు పని కల్పించే హక్కు ప్రభుత్వానికి ఉందని ఆయన వివరించారు. ఈ కార్యక్రమంలో నాయకులు శాగ బాబు, బాయికాడి పరశురాములు, కర్రోళ్ల దాకయ్య, కిషన్ తదితరులు పాల్గొన్నారు.



