Wednesday, September 3, 2025
E-PAPER
spot_img
Homeతెలంగాణ రౌండప్కాటారంలో దళిత బంధు సాధన సమితి ధర్నా, రాస్తారోకో

కాటారంలో దళిత బంధు సాధన సమితి ధర్నా, రాస్తారోకో

- Advertisement -

నముండ్ల సంపత్ మహరాజ్ దళిత బందు సాధన సమితి జిల్లా అధ్యక్షులు
నవతెలంగాణ- కాటారం

దళిత బందు సాధన సమితి జిల్లా అధ్యక్షులు నముండ్ల సంపత్ మహరాజ్ ఆధ్వర్యంలో కాటారం మండలం గారేపల్లి అంబేద్కర్ కూడలిలో బుధవారం ధర్నా కార్యక్రమం జరిగింది. ఈ సందర్బంగా సంపత్ మహారాజ్ మాట్లాడుతూ… రెండవ విడత దళిత బంధు నిధులను ఫ్రీజింగ్‌లో ఉంచడం దుర్మార్గమని విమర్శించారు. వాటిని ప్రభుత్వం తక్షణమే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. దళిత కుటుంబాలు ఎంతో ఆసరా కోసం ఎదురుచూస్తున్నాయని, మరింత ఆలస్యం జరిగితే రాష్ట్రవ్యాప్తంగా పెద్దఎత్తున ఆందోళనలు చేపడతామని హెచ్చరించారు.

ధర్నా కారణంగా రహదారిపై వాహనాల రద్దీ పెరిగి ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. సమాచారం అందుకున్న కాటారం డీఎస్పీ సూర్యనారాయణ సిబ్బందితో అక్కడికి చేరుకుని నాయకులతో మాట్లాడి ధర్నాను శాంతింపజేశారు.ఈ కార్యక్రమంలో వేమునూరి జక్కయ్య, బోబ్బిలి వేంకన్న, పులి రామన్న, మంథేన సమ్మన్న, ఆత్కూరి శంకర్, మేరుగు లక్మన్, లింగాల రామన్న, నార రమేష్, మేడిపల్లి సతీష్, మేడిపల్లి వేంకన్న తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
spot_img
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -spot_img
Ad
Ad