Thursday, September 11, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్దళిత బంధు నిధులు విడుదల చేయాలి

దళిత బంధు నిధులు విడుదల చేయాలి

- Advertisement -

నవతెలంగాణ – చారకొండ 
దళిత బంధు రెండవ విడత నిధులు మంజూరు చేయాలని చారకొండ మండలానికి చెందిన పలు గ్రామాల లబ్ధిదారులు గురువారం కల్వకుర్తి ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డి ని మర్యాదపూర్వకంగా కలిసి వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ గత ప్రభుత్వం దళిత బంధు పథకాన్ని ప్రవేశ పెట్టీ ,మండలాన్ని పైలెట్ ప్రాజెక్టుగా ఎంపిక చేసి మొదటి విడత నిధులు మంజూరు చేసిందన్నారు. అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా రెండో విడత విడుదలైన నిధులు మంజూరు జాప్యం జరిగిందనీ, ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం చొరవ తీసుకొని నిధులు మంజూరు చేసి యూనిట్లను వెంటనే పంపిణీ చేయాలని ఎమ్మెల్యేలు కోరారు. ఎస్సీ కార్పొరేషన్ ఈడీ తో మాట్లాడి సత్వరమే సమస్యను పరిష్కరించేందుకు కృషి చేస్తానని ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డి హామీ ఇచ్చినట్లు లబ్ధిదారులు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో కొట్ర గణేష్ ,బొల్లె వెంకట్, వంకేశ్వరం రాకేష్ తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -