– పద్మశ్రీ మందకృష్ణ మాదిగ
– ఎమ్మార్పీఎస్ ఆధ్వర్యంలో దళితుల ఆత్మగౌరవ ర్యాలీ
నవతెలంగాణ-ముషీరాబాద్
సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ గవారు మీద దాడి జరిగితే దేశ వ్యవస్థలన్నీ ఎలాంటి చర్యలకు ఉపక్రమించకుండా మౌనం వహించి అంటరానితనాన్ని ప్రదర్శించాయని ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షులు, పద్మశ్రీ మందకష్ణ మాదిగ అన్నారు. ఇది రాజ్యాంగానికి విరుద్ధమన్నారు. జస్టిస్ గవాయిమీద జరిగిన దాడిని నిరసిస్తూ శనివారం హైదరాబాద్‌లోని ఇందిరా పార్క్ నుంచి బాబు జగ్జీవన్‌రామ్ విగ్రహం వరకు దళితుల ఆత్మగౌరవ ర్యాలీని ఎమ్మార్పీఎస్ ఆధ్వర్యంలో వేలాదిమందితో నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గవారు దళితుడు కాబట్టే దాడి జరిగిందని, అదే ఆయన స్థానంలో ఉన్నత వర్గానికి చెందిన న్యాయమూర్తి ఉంటే దాడి జరిగేదా అని ప్రశ్నించారు. ఢిల్లీ పోలీసులు ఇప్పటికీ కేసు ఎందుకు పెట్టలేదని, సుప్రీం కోర్టు సుమోటోగా కేసు ఎందుకు స్వీకరించలేదని, జాతీయ మానవ హక్కుల కమిషన్ ఎందుకు మౌనంగా ఉందని ప్రశ్నించారు. ఇలాంటి పరిస్థితుల్లో దళితులకు రక్షణ ఎక్కడ ఉంటుందని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ నెల 17న ఛలో ఢిల్లీకి పిలుపునిస్తున్నట్టు ప్రకటించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మార్పీఎస్ జాతీయ అధ్యక్షులు డా.మున్నంగి నాగరాజు మాదిగ, రాష్ట్ర అధ్యక్షులు గోవిందు నరేష్ మాదిగ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షులు రుద్రపోగు సురేష్ మాదిగ, తదితరులు పాల్గొన్నారు.
దేశ వ్యవస్థలకూ దళితులు అంటరానివారయ్యారు
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



