శ్రీరామ్ సాగర్ ప్రాజెక్ట్ కి దామన్న పేరు పెట్టడం హర్షణీయo..
దామన్న స్ఫూర్తితో ముందుకెళ్తాం..
సంతాప సభలో ప్రమోద్ కుమార్..
నవతెలంగాణ – భువనగిరి
మాజీ మంత్రి వర్యులు , రాంరెడ్డి దామోదర్ రెడ్డి మృతి రాష్ట్ర ప్రజలకు,ఉమ్మడి నల్లగొండ జిల్లా ప్రజలకు కాంగ్రెస్ పార్టీ కి తీరని లోటు అని కాంగ్రెస్ పార్టీ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కాంగ్రెస్ పార్టీ పరిశీలకుడు పోత్నక్ ప్రమోద్ కుమార్ అన్నారు. అదివారం భువనగిరి జిల్లా కేంద్రంలోని హౌసింగ్ బోర్డు లో మాజీ కౌన్సిలర్ రాచమల్ల రమేష్ అధ్యక్షతన జరిగిన సంతాప సభ లో ప్రమోద్ కుమార్ మాట్లాడుతూ రెండు సార్లు మంత్రిగా ,5 సార్లు శాసనసభ్యుడిగా, యువజన కాంగ్రెస్ నాయకునికా పిసిసి ఉపాధ్యక్షులుగా , ఎఐసిసి సభ్యునిగా అనేక ఎన్నికల్లో పార్టీ ఇంచార్జీ గా పనిచేసిన వ్యక్తి దామన్న అని వారి చిరకాల కోరిక అయిన శ్రీరామ్ సాగర్ ప్రాజెక్ట్ ఫేజ్ 2 కి దామన్న పేరు పెట్టడం హర్షణీయమన్నారు.
ఈ సందర్భంగా రాష్ట ప్రభుత్వానికి ,ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కి,జిల్లా మంత్రులు వెంకట్ రెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి కు , కృతజ్ఞతలు తెలుపుతున్నామన్నారు. వారి ఆశయ సాధనకు ప్రతి ఒక్కరు కృషి చేయాలని వారి కుటుంబానికి భగవంతుడు ధైర్యాన్ని ప్రసాదించాలని కోరుతున్నామని అన్నారు.ఈ కార్యక్రమంలో జిల్లా కాంగ్రెస్ ఎస్సీ విభాగం అధ్యక్షులు దర్గాయి హరిప్రసాద్,సీనియర్ నాయకులు డి.రాములు,భువనగిరి పార్లమెంట్ కో ఆర్డినేటర్ ఎండి అతహర్ ,వర్తక సంఘం అధ్యక్షులు మంచికంటి కృష్ణమూర్తి, యువజన నాయకుడు బింగి నరేష్ ,జిల్లా ఓబీసీ ఉపాధ్యక్షులు నాకోటి రాము, పట్టణ అధ్యక్షులు కాల్య నాగరాజు,యువజన కాంగ్రెస్ అసెంబ్లీ ప్రధాన కార్యదర్శి ఎండి నేహాల్,మహిళా కాంగ్రెస్ నేత దేవరంగుల కవిత పాల్గొన్నారు.
దామన్న మృతి పార్టీకి, ప్రజలకు తీరని లోటు
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES