No menu items!
Wednesday, August 20, 2025
E-PAPER
spot_img
No menu items!
Homeతెలంగాణ రౌండప్ఎంజిఎన్ఆర్జిఎస్ రాష్ట్ర కౌన్సిల్ మెంబర్ గా దండు రమేష్

ఎంజిఎన్ఆర్జిఎస్ రాష్ట్ర కౌన్సిల్ మెంబర్ గా దండు రమేష్

- Advertisement -

నవతెలంగాణ – మల్హర్ రావు
జాతీయ గ్రామీణ  ఉపాధి హామీ పథకం తెలంగాణ రాష్ట్ర కౌన్సిల్ మెంబర్ గా భూపాలపల్లి జిల్లా మల్హర్ మండల కేంద్రమైన తాడిచేర్ల గ్రామానికి చెందిన దండు రమేష్ ను నియమకం చేశారు. ఈ సందర్భంగా మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు. రామగుండం మాజీ ఎమ్మెల్యే, మంత్రి మాలం మల్లేష్ అల్లుడిగా, ఉన్నతమైన న్యాయవాద చదువులు చదివి, పలు ఉద్యమాలు చేసిన వ్యక్తిగా పేరుంది. గత పదిహేనేళ్లుగా కాంగ్రెస్  పార్టీ పటిష్టత కోసం అహర్నిశలు కృషి చేస్తూ.. మంత్రి శ్రీధర్ బాబు, శ్రీనుబాబు లకు నమ్మిన బంటుగా కొనసాగుతున్నారు. అలాగే 2016 సంవత్సరం నుంచి కాంగ్రెస్ పార్టీ ఎస్సిసెల్ విభాగం భూపాలపల్లి జిల్లా చైర్మన్ గా కొనసాగుతు పార్టీ కోసం పలు సేవలందించారు. ఈ నేపథ్యంలో ఈజిఎస్ పథకంలో రాష్ట్ర స్థాయిలో గౌరవం దక్కడంపై రాష్ట్ర సీఎం రేవంత్ రెడ్డి, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి ధనసరి సీతక్క,రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ దుద్దిళ్ల శ్రీధర్ బాబు, టీపీసీసీ ప్రధాన కార్యదర్శి దుద్దిళ్ల శ్రీనుబాబు లకు రమేష్ ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. తనపై నమ్మకంతో అప్పజెప్పిన ఈ బాధ్యతకు మరింత గౌరవం పెరిగేలా చేస్తానన్నారు.

- Advertisement -
spot_img
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -spot_img
Ad
Ad