విడుతల వారిగా సర్వే: తహశీల్దార్ రవికుమార్
నవతెలంగాణ – మల్హర్ రావు
మండల కేంద్రమైన తాడిచెర్లలోని కాపురం ఓసిపి బ్లాక్-1కు డేంజర్ జోన్లో ఉన్న భూ నిర్వాసితులు దళారులను నమ్మొద్దని మండల తహశీల్దార్ రవికుమార్ సూచించారు. మంగళవారం విలేకరుల సమావేశంలో మాట్లాడారు. డేంజర్ జోన్లో ఉన్న ఇండ్లకు, భూములకు పరిహారం, ఆర్అండ్ఆర్ ప్యాకేజి ఇప్పిస్తామంటూ కొందరు దళారులు అడిగే ప్రయత్నం చెసిన నిర్వాసితులు నమ్మొద్దని ఎవరికి డబ్బులు ఇచ్చి మోసపోవద్దని, దళారుల మాయమాటలు నమ్మొద్దని సూచించారు.
అక్రమంగా నిర్వాసితుల నుంచి డబ్బులు వసూలు చేస్తే చట్టపరమైన చర్యలు తప్పవని హెచ్చరించారు. డేంజర్ జోన్లో ఉన్న ఇండ్ల పరిహారం, ప్యాకేజి ఇవ్వడానికి భూపాలపల్లి జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ అదేశాలతో సర్వే బృందాలు సర్వే చేస్తున్నాయని, సర్వే బృందాలకు నిర్వాసితులు పూర్తి వివరాలు తెలియజేస్తూ సహకరించాలని కోరారు. మొదటి సర్వేలో 1203 ఇండ్లు, రెండో విడత సర్వేలో 1062 ఇండ్లను సర్వే చేయడం జరుగుతుందని తెలిపారు. మొదటి విడుతలో ఇప్పటికే వెయ్యి ఇండ్ల వరకు సర్వే పూర్తియినట్లుగా తెలిపారు.
ఆందోళనలో నిర్వాసితులు..
సర్వే ప్రారంభం నుంచి కొందరి ఇండ్లను సర్వే చేస్తూ, మరి కొందరు ఇండ్లు సర్వే చేయకపోవడంతో ఆందోళనకు గురివుతున్నట్లుగా తెలుస్తోంది. నివాసయోగ్యం అయినవి మాత్రమే సర్వే చేస్తారా.? నివాస యోగ్యం కానీ ఇండ్లు సర్వే చేస్తారో లేదోని నిర్వాసితులు అయోమయానికి గురివుతున్నట్లుగా తెలుస్తోంది. డేంజర్ జోన్లో మొత్తం 2472 ఇండ్లు ఉండగా ప్రస్తుతం 1203 ఇండ్లు సర్వే చేస్తుండగా.. టిఎస్ జెన్కో నెంబర్ వేసిన 2022లో డిమాండ్ రిజిస్టర్ లో 349 ఇండ్లు నమోదు అయినట్లుగా, రెండో విడత సర్వేలో 1062 ఇండ్లు ఉన్నట్లుగా, ఎపి జెన్కో నెంబర్ తో 1088 ఉన్నట్టుగా, బై నెంబర్ అధికారులు చేర్చగా అవి 1203 సంఖ్య పేరిగినట్లుగా తెలుస్తోంది. జీపీ డిమాండ్ రిజిస్టర్ లో దాదాపు 1600 ఇండ్లు చెరినట్లుగా సమాచారం.



