నవతెలంగాణ – జుక్కల్
జుక్కల్ మండలంలోని లొంగన్ దాబా క్రాస్ రోడ్డు పెట్రోల్ పంప్ దగ్గర్లో ఉన్న వ్యవసాయ భూమిలో విద్యుత్ స్తంభం ప్రమాదకరంగా వంగిపోయి ఉన్నది. పట్టించుకోవాల్సిన విద్యుత్ శాఖ అధికారులు చూసి చూడనట్టు ఉంటున్నారని వ్యవసాయ రైతులు ఆరోపణలు చేస్తున్నారు. గత కొన్ని రోజులుగా ఈ స్తంభం వంగిపోయి ఉన్నా అటుగా వెళుతున్న వివిధ శాఖల అధికారులు , విద్యుత్ శాఖ సంబంధించిన అధికారులు పట్టించుకోవడంలేదని సంబంధిత శివారులోని వ్యవసాయ భూముల యజమానులు తెలిపారు.
వ్యవసాయ పనుల నిమిత్తం వచ్చే వ్యవసాయ కూలీలు, మేత మేయడానికి వచ్చే పశువులు వస్తాయని అన్నారు. పంట పొలంలోకి అనుకోకుండా మనుషులు, పశువులు వస్తే వారికి ప్రాణాపాయం ఉందని అటు దారిన పోయేవారు అన్నారు. చేతికి అందే విధంగా విద్యుత్ స్తంభం వంగిపోయి తీగలు వేలాడుతూ చేతితో పట్టుకునే విధంగా ఉండడంతో పంట పొలాలలో పశువులు మేయడానికి వచ్చినప్పుడు విద్యుత్ షాక్ ప్రమాదానికి గురై చనిపోయే ప్రమాదం నెలకొని ఉందని వారు అన్నారు. ఇప్పటికైనా విద్యుత్ శాఖ అధికారులు ప్రమాదాలు జరగకుండా వంగిపోయి ఉన్న స్తంభాన్ని , తీగలు సరిచేసి విద్యుత్తు ముందస్తుగా ప్రమాదాలు చోటు చేసుకోకుండా చూడాలని వ్యవసాయదారులు కోరుతున్నారు.
ప్రమాదకరంగా విద్యుత్ స్థంభాలు.. పట్టించుకోని అధికారులు
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES