Sunday, May 18, 2025
Homeహెల్త్డయాబెటిస్‌ పేషంట్స్‌లో కనిపిస్తున్న డేంజరస్‌ ట్రెండ్‌

డయాబెటిస్‌ పేషంట్స్‌లో కనిపిస్తున్న డేంజరస్‌ ట్రెండ్‌

- Advertisement -

మధుమేహం (Diabetes) ఒక జీవితకాలపు వ్యాధి. దీనిని పూర్తిగా నయం చేయలేకపోయినా, సరైన జీవనశైలి మార్పులు, ఆహారపు అలవాట్లు, వైద్యుల సలహాలతో దీనిని నియంత్రించవచ్చు. కొంతమంది మందులు లేదా సప్లిమెంట్స్‌ లేకుండా కేవలం ఆహారం ద్వారా మాత్రమే షుగర్‌ను నియంత్రించాలని ప్రయత్నిస్తారు. అయితే, ఇది ఆరోగ్యానికి హానికరం కావచ్చు. ఈ వ్యాసంలో, ఎలా సమగ్రంగా ఆరోగ్యాన్ని కాపాడుకోవాలో, వైద్యుల సలహా ప్రకారం మాత్రమే మందులు తీసుకోవడం ఎందుకు ముఖ్యమో వివరిస్తాం.
రీసెంట్‌ గా ఒక రోజు ఒ.పి.కి 41 సంవత్సరాలున్న ఆర్కిటెక్‌ డయాబెటిస్‌ పేషెంట్‌ కన్సల్టేషన్‌ కోసం వచ్చారు. అతను చెప్పింది ఏంటంటే రెండు సంవత్సరాల క్రితమే అతనికి డయాబెటిస్‌ డిటెక్ట్‌ అయిందని. ఎప్పటి నుంచి ఉందో కరెక్ట్‌గా తెలియదు మేడం, కానీ 2 ఇయర్స్‌ నుంచి డిటెక్ట్‌ అయింది అని చెప్పాడు.
డైట్‌ చేంజెస్‌ ద్వారా డయాబెటిస్‌ కంట్రోల్‌ చేసుకుందాం అని టాబ్లెట్‌ ఇప్పటి వరకు ఏవీ స్టార్ట్‌ చేయలేదు అన్నాడు. ఒక్కసారి అతని లైఫ్‌ హిస్టరీ తీసుకున్నప్పుడు, ఫ్రీక్వెంట్‌గా ట్రావెల్‌ చేస్తుంటారు, ఎక్కువగా బయట ఉండటం, బయట తినడం, ఆలస్యంగా నిద్రపోవడం, దానికి తగట్టు నిద్ర అడ్జస్ట్‌ చేసుకుంటా అని చెప్పారు. మరి ఎలాంటి లైఫ్‌ స్టైల్‌ చేంజెస్‌ చేసుకుంటున్నారు అని లోతుగా ప్రశ్నించినప్పుడు కేవలం న్యూట్రిషన్‌ పైన ఫోకస్‌ చేస్తున్నట్లు అర్థమైంది. కానీ మనందరికి తెలుసు డయాబెటిస్‌ కంట్రోల్‌ చేసుకోవాలి అంటే కేవలం న్యూట్రిషనే కాదు.. ఓవరాల్‌గా అన్నీ లైఫ్‌ స్టైల్‌ చేంజెస్‌ పైన ఫోకస్‌ చెయ్యాల్సి ఉంటుంది. మరి లైఫ్‌స్టైల్‌ చేంజెస్‌ చెయ్యలేక పోతున్నప్పుడు.. కనీసం టాబ్లెట్ల హెల్ప్‌ అన్నా తీసుకోవాలి కదా. టాబ్లెట్లు తీసుకోకుండా, లైఫ్‌స్టైల్‌ చేంజెస్‌ పూర్తిగా చేసుకోలేకపోతే, మీరు ఇవ్వన్నీ చేంజెస్‌ చేసుకునే అంతవరకు డయాబెటిస్‌ వెయిట్‌ చేస్తూ వుండదు కదా!
చాలామంది డయాబెటిక్‌ పేషంట్స్‌ డాక్టర్‌ సలహా లేకుండా మందులు మానేసి, కేవలం డైట్‌ ద్వారా షుగర్‌ను కంట్రోల్‌ చేయాలనుకుంటారు. కొన్ని సందర్భాల్లో ఇది ప్రయోజకరంగా ఉండవచ్చు, కానీ ఎక్కువ మందికి ఇది ప్రమాదకరమైన పరిణామాలను తీసుకువస్తుంది.
డాక్టర్‌ పేషెంట్‌కి వివరించిన విధానం : ఆల్రెడీ మనకి డయాబెటిస్‌ ఉందని డిటెక్ట్‌ అవడానికి ముందే చాలా రోజులు బాడీలో ఉంటుంది. ఫ్రీ డయాబెటిస్‌ స్టేజ్‌ నుంచే కాంప్లికేషన్స్‌ వస్తాయి. ప్రత్యేకంగా గుండెకి సంబంధించిన సమస్యలు ప్రీ డయాబెటిస్‌ స్టేజ్‌ నుంచి స్టార్ట్‌ అవుతాయి. అలాంటప్పుడు.. మీ లైఫ్‌స్టైల్‌ చేంజెస్‌ చేసుకోవడానికి టైమ్‌ పడుతుంది కదా. అందుకే మినిమల్‌ టాబ్లెట్లు తీసుకోవాలి. ప్రొటెక్షన్‌ కోసం ఇది అర్థం చేసుకోకుండా చాలామంది పేషెంట్స్‌ ఎంత హై షుగర్స్‌ ఉన్నా.. మేం డైట్ర్‌ చేంజెస్‌ ద్వారా చేసుకుంటాం అని, టాబ్లెట్లను డిలే చేస్తూ ఉంటారు. మీరు లైఫ్‌ స్టైల్‌ చేంజెస్‌ చేసుకోండి కానీ, లైఫ్‌ స్టైల్‌ చేంజెస్‌ మీరు చేసుకోలేనపుడు.. ప్రొటెక్షన్‌ కోసం మినిమల్‌ మెడిసిన్‌ వాడడం చాలా చాలా అవసరం. దయచేసి దీనిని గమనించండి. ఈ ట్రెండ్‌ చాలా ఎక్కువ అయిపోయింది.
కేవలం డైట్రీ చేంజెస్‌ ద్వారా డయాబెటిస్‌ నియంత్రణ కష్టం
ముగింపు
డయాబెటిస్‌ నియంత్రించడానికి కేవలం ఆహారం మాత్రమే సరిపోదు. సమగ్ర జీవనశైలి మార్పులు, వ్యాయామం, మానసిక సమతుల్యత, వైద్యుల మార్గదర్శకత్వం అత్యంత అవసరం. మందులు లేదా సప్లిమెంట్స్‌ను డాక్టర్‌ సలహా లేకుండా మానివేయకండి. ప్రతిరోజూ ఆరోగ్యకరమైన అలవాట్లను పాటించడం ద్వారా, డయాబెటిస్‌తో సుఖంగా జీవించవచ్చు!
‘ఆరోగ్యమే మహాభాగ్యం’ సంతోషంగా ఉండటానికి జీవనశైలి మార్పులు చేయండి!

Dr.Prathusha. Nerella
MD;FID;NLP;CCEBDM;CCGDM
Senior General Physician,
Diabetes&Lifestyle Expert
Ph: 8897684912/040-49950314

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -