Monday, January 26, 2026
E-PAPER
Homeఅంతర్జాతీయంగ్రీన్‌లాండ్‌లో డెన్మార్క్‌ ప్రధాని ఆకస్మిక పర్యటన

గ్రీన్‌లాండ్‌లో డెన్మార్క్‌ ప్రధాని ఆకస్మిక పర్యటన

- Advertisement -

– స్థానికులకు భరోసా ఇచ్చేందుకే వచ్చా
– మెట్‌ ఫ్రెడరిక్సెన్‌ వెల్లడి
నూక్‌ (గ్రీన్‌లాండ్‌) :
గ్రీన్‌లాండ్‌ భవిష్యత్తుపై అనిశ్చితి కొనసాగుతున్న నేపథ్యంలో డెన్మార్క్‌ ప్రధాని మెట్‌ ఫ్రెడరిక్సెన్‌ ఎలాంటి ముందస్తు ప్రకటనా లేకుండా శుక్రవారం గ్రీన్‌ల్యాండ్‌కు చేరుకున్నారు. గత 300 ఏండ్లుగా డెన్మార్క్‌లో భాగంగా ఉన్న గ్రీన్‌ల్యాండ్‌కు ఆమె ఆకస్మిక పర్యటన జరిపారు. ఈ పర్యటనలో ఆమె గ్రీన్‌లాండ్‌ ప్రధాని జెన్స్‌-ఫ్రెడరిక్‌ నీల్సన్‌తో సుమారు గంట పాటు చర్చలు జరిపారు. అనంతరం రాజధానిలోనీ తీర ప్రాంతం, ఒక కిండర్‌గార్టెన్‌ను సందర్శించి ఇతర స్థానిక అధికారులతో భేటీ అయ్యారు. అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్‌ ట్రంప్‌.. గ్రీన్‌లాండ్‌ను అమెరికా జాతీయ భద్రతకు కీలకమని పేర్కొంటూ దానిపై తన ఆసక్తిని మళ్లీ వ్యక్తం చేయడం, ఇలాంటి తరుణంలో డెన్మార్క్‌ ప్రధాని ఆకస్మిక పర్యటన చేయడం ప్రాధాన్యతను సంతరించుకుంది. కాగా తన పర్యటన ఉద్దేశం గ్రీన్‌ల్యాండ్‌లో నివసిస్తున్న సుమారు 57 వేల మందికి భరోసా ఇవ్వడమేనని ఫ్రెడరిక్సెన్‌ తెలిపారు. ”గ్రీన్‌లాండ్‌ ప్రజలకు డెన్మార్క్‌ పూర్తి మద్దతు ఉన్నదని చూపేందుకే నేను ఇక్కడికి వచ్చాను” అని ఆమె అన్నారు. రెండు ప్రభుత్వాల మధ్య సన్నిహిత సమన్వయం అవసరమని చెప్పారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -