ఒకప్పుడు అరుదైన సమస్యగా భావించిన డార్క్ సర్కిల్స్ ఇప్పుడు ప్రతి ఇంట్లో సాధారణ సమస్యగా మారిపోయింది. ఈ సమస్య నుంచి బయటపడేందుకు చాలామంది మార్కెట్‌లో దొరికే ఖరీదైన క్రీములు, సెరమ్స్, ట్రీట్‌మెంట్స్ వైపు పరుగులు పెడుతున్నారు. అయితే బ్యూటీ నిపుణుల హెచ్చరిక ప్రకారం, డార్క్ సర్కిల్స్ తగ్గిస్తామంటూ అమ్మే చాలా క్రీముల్లో బలమైన రసాయనాలు ఉంటున్నాయి. ఇవి కళ్ల చుట్టూ ఉన్న సున్నితమైన చర్మాన్ని మరింత బలహీనపరుస్తాయి. దీర్ఘకాలం ఈ క్రీములను ఉపయోగించడం వల్ల చూపుపై కూడా ప్రభావం పడే అవకాశం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఇంట్లో సులువుగా దొరికే సహజ పదార్థాలతో చర్మాన్ని కాపాడుకోవచ్చునని నిపుణులు చెబుతున్నారు. కళ్ల కింద వచ్చే ఉబ్బరం, లోతైన గుంతలు కూడా క్రమంగా తగ్గించడంలో ఇవి సహాయపడతాయి. ముఖ్యంగా ఎటువంటి దుష్ప్రభావాలు లేకుండా దీర్ఘకాలం ఉపయోగించుకోవచ్చని నిపుణులు చెబుతున్నారు.
డార్క్ సర్కిల్స్ తగ్గడంలో నిద్ర చాలా కీలక పాత్ర పోషిస్తుంది. రాత్రి ఆలస్యంగా పడుకోవడం, ఉదయం ఆలస్యంగా లేవడం వల్ల శరీరంలోని జీవ గడియారం పూర్తిగా గందరగోళం అవుతుంది. దీని ప్రభావం ముందుగా కళ్ల చుట్టూ కనిపిస్తుంది. వైద్యుల సూచనల ప్రకారం రాత్రి 10:30 గంటలలోపు నిద్రపోయి, ఉదయం 6 గంటల సమయంలో లేవడం కంటి ఆరోగ్యానికి చాలా మంచిదిగా చెబుతున్నారు. ప్రతిరోజూ ఒకే సమయానికి నిద్ర, మేల్కొలుపు అలవాటు చేసుకుంటే ముఖంలో సహజ మెరుపు తిరిగి కనిపించడం మొదలవుతుంది. వెల్లుల్లి వల్ల శరీరంలో రక్తప్రసరణ వేగంగా జరిగి, ఆక్సిజన్, పోషకాలు చర్మానికి సులభంగా చేరుతాయి. ఈ కారణంగా స్కిన్ టోన్ క్రమంగా మెరుగవుతుంది. డార్క్ సర్కిల్స్ మాత్రమే కాదు, ముడతలు, వద్ధాప్య లక్షణాలు కూడా కొంతవరకు తగ్గుతాయి. అలాగే స్క్రీన్ టైమ్ తగ్గించడం, పడుకునే ముందు కళ్లపై చల్లటి నీళ్లు చల్లుకోవడం, పుష్కలంగా నీళ్లు తాగడం, పౌష్టికాహారం తీసుకోవడం వంటి చిన్న అలవాట్లు కూడా పెద్ద మార్పు తీసుకురాగలవని నిపుణులు సూచిస్తున్నారు.
కళ్ళ కింద నల్లమచ్చలా..!
- Advertisement -
- Advertisement -



