– బీసీటీఏ అధ్యక్షులు కృష్ణుడు డిమాండ్
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్
రాష్ట్రంలోని ఉద్యోగులు, ఉపాధ్యాయులకు పెండింగ్ లో ఉన్న ఐదు డీఏలను వెంటనే ప్రకటించాలని బీసీటీఏ రాష్ట్ర అధ్యక్షులు కె కృష్ణుడు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. గురువారం హైదరాబాద్‌లో బీసీటీఏ హైదరాబాద్ కార్యవర్గ సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఉద్యోగులకు సంబంధించిన పెండింగ్ బిల్లులను వెంటనే చెల్లించాలని కోరారు. ఖాళీగా ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి డీఎస్సీని ప్రకటించాలని అన్నారు. 50 శాతం ఫిట్‌మెంట్‌తో పీఆర్సీని ప్రకటించాలన్నారు. ఉద్యోగులకు ఆరోగ్య కార్డులను ఇవ్వాలనీ, అన్ని కార్పొరేట్ ఆస్పత్రుల్లో అమలయ్యే విధంగా చూడాలని కోరారు. బీసీ ఉద్యోగులు, ఉపాధ్యాయులకు పదోన్నతుల్లో రోస్టర్ కం మెరిట్ విధానాన్ని అమలు చేయాలని చెప్పారు. సీపీఎస్ విధానాన్ని రద్దు చేసి ఓపీఎస్‌ను అమలు చేయాలని అన్నారు. ఖాళీగా ఉన్న హెచ్‌ఎం, స్కూల్ అసిస్టెంట్ పోస్టులకు పదోన్నతుల షెడ్యూల్‌ను విడుదల చేయాలని డిమాండ్ చేశారు. హైదరాబాద్ నూతన కమిటీ ఎన్నుకున్నారు. అధ్యక్షులు బి సంతోష్‌కుమార్, ప్రధాన కార్యదర్శిగా ఆర్ లక్ష్మీకాంతరావు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. వారికి బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షులు, ఎంపీ ఆర్ కృష్ణయ్య నియామక పత్రాలను అందజేశారు.
డీఏలను వెంటనే ప్రకటించాలి
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES