నవతెలంగాణ – అశ్వారావుపేట
తెలంగాణా కవి దాశరధి కృష్ణమాచార్యుల జయంతి వేడుకలను అశ్వారావుపేట జిల్లాపరిషత్ ఉన్నత పాఠశాలలో మంగళవారం ఘనంగా నిర్వహించారు. పాఠశాల తెలుగు ఉపాధ్యాయులు పుల్లయ్య, దుర్గయ్య ఆధ్వర్యంలో పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు హరిత అధ్యక్షతన జరిగిన జయంతోత్సవ సభలో ఆమె మాట్లాడుతూ “జన్మ జన్మల బూజు నిజాం అంటూ” నాటి నిజాం పాలన పై ఎక్కుపెట్టిన అస్త్రం లా విమర్శలు గుప్పిస్తూనే “నా తెలంగాణా కోటి రతనాల వీణ అంటూ తెలంగాణా” కలను సాకారం చేయాలని కోరుతూ నిద్రాణమై ఉన్న తెలంగాణా సమాజాన్ని మేల్కొల్పిన గొప్ప కవి అని అన్నారు.ప్రముఖ సాహితీవేత్త సిద్ధాంతపు ప్రభాకరాచార్యులు మాట్లాడుతూ ఉద్యమమే ఊపిరిగా జీవిస్తున్న కాలంలో కలిగిన కష్టాల తిమిరంతో సమరం చేసి అగ్ని ధారలు కురిపించిన కవి దాశరధి అని,తాత్విక చింతనకు ఆయన రాసిన గాలీబ్ గీతాలు అద్దం పడతాయని,సర్వమానవ సౌభ్రాతృత్వం ఆయన కవిత్వ సిద్ధాంతమని అన్నారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాద్యాయులు,విద్యార్ధులు పాల్గొన్నారు.
ఘనంగా దాశరథి జయంతి వేడుకలు
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES