నవతెలంగాణ – హైదరాబాద్: ప్రేమ అనేది ఒక మనిషిని ఉన్నతుడిని చేయాలి.. కానీ నేటి తరం యువతలో అది ప్రాణాలు తీసేంత ఉన్మాదంగా, లేదా ప్రాణాలు తీసుకునేంత బలహీనతగా మారిపోతోంది. తెలంగాణలో తాజాగా వెలుగుచూసిన రెండు వేర్వేరు ఘటనలు చూస్తుంటే కన్నప్రేమ కంటే క్షణికావేశమే పెద్దదైపోయిందా అన్న అనుమానం కలుగుతోంది. వికారాబాద్ జిల్లాలో ఒక యువతి తన ఇన్‌స్టాగ్రామ్ ప్రియుడి కోసం ఏకంగా కన్నవారినే కడతేర్చింది. యాచారంలో జరిగిన ఘటన సభ్య సమాజం తలదించుకునేలా ఉంది. నక్కల సురేఖ అనే యువతి నర్సింగ్ పూర్తి చేసి ఆసుపత్రిలో పనిచేస్తోంది. ఇన్‌స్టాగ్రామ్‌లో పరిచయమైన వేరే కులం యువకుడిని పెళ్లి చేసుకుంటానంటే తల్లిదండ్రులు ఒప్పుకోలేదన్న ఒకే ఒక్క కారణంతో వారిపై కక్ష పెంచుకుంది. తాను పని చేస్తున్న ఆసుపత్రి నుంచి అత్యవసర సమయంలో వాడే మత్తు ఇంజెక్షన్లను గుట్టుగా తెచ్చి, నడుము నొప్పి తగ్గుతుందంటూ మాయమాటలు చెప్పి కన్నతల్లిదండ్రులకు అధిక మోతాదులో ఇచ్చింది. ఆ ఇంజెక్షన్ల ధాటికి వారు కుప్పకూలిపోగా, ఏమీ తెలియనట్లు తన అన్నకు ఫోన్ చేసి వారు స్పృహ తప్పారని నాటకమాడింది. కానీ సంఘటనా స్థలంలో దొరికిన ఖాళీ సిరంజిలు ఆమె చేసిన ఘోరాన్ని పోలీసులకు పట్టించాయి.
ప్రేమ పెళ్లి వద్దన్నందుకు తల్లిదండ్రులను చంపిన కూతురు..
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



