ఉదయం కూతురు, సాయంత్రం తల్లి మృతి
శోకసంద్రంలో కుటుంబం.. ఎల్గోయి గ్రామంలో విషాదం
నవతెలంగాణ-ఝరాసంగం
అల్లారు ముద్దుగా పెంచుకున్న కూతురు అనారోగ్యానికి గురై కండ్ల ముందే మరణించడంతో దాన్ని జీర్ణించుకోలేక తల్లి ఆత్మహత్య చేసుకున్న హృదయ విదారకర ఘటన సంగారెడ్డి జిల్లా ఝరాసంగం మండల పరిధిలోని ఎల్గోయి గ్రామంలో జరిగింది. స్థానిక ఎస్‌ఐ పాటీల్ క్రాంతి కుమార్ తెలిపిన వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన బోయిని వెంకట్, లావణ్య దంపతుల కూతురు వైష్ణవి(3).. నిమోనియా వ్యాధితో బాధపడుతుంది. దాంతో తమ కూతురిని నీలోఫర్ ఆస్పత్రికి చికిత్స నిమిత్తం తరలించగా చికిత్స పొందుతూ పరిస్థితి విషమించి శనివారం మరణించింది. చిన్నారి అంత్యక్రియలు స్వగ్రామం ఎల్గోయిలో నిర్వహించారు. అంత్యక్రియల అనంతరం బంధువులు అందరూ వెళ్ళిపోయిన తర్వాత కూతురు మరణాన్ని జీర్ణించుకోలేని తల్లి లావణ్య(28) ఇంట్లోకి వెళ్ళి ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. ఉదయం కూతురు, సాయంత్రం తల్లి మరణించడంతో ఆ కుటుంబం శోక సంద్రంలో మునిగింది. ఈ ఘటనతో గ్రామంలో విషాధఛాయలు నెలకొన్నాయి. మృతురాలి భర్త బోయిని వెంకట్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్‌ఐ తెలిపారు.
కూతురి మరణం.. తల్లి ఆత్మహత్య
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES


