Monday, November 24, 2025
E-PAPER
Homeఎడిట్ పేజిడాజ్లింగ్‌ ఫెన్స్‌

డాజ్లింగ్‌ ఫెన్స్‌

- Advertisement -

‘మిరుమిట్లు గొలిపే కంచె’ అనే మాటను ”ప్యారడైజ్‌ లాస్ట్‌” అనే అద్భుత ఐతిహాసిక కావ్యంలో జాన్‌ మిల్టన్‌ అనే ఇంగ్లీషు కవి రాస్తాడు. స్వర్గం అభేద్యం కాదని వ్యంగ్యంగా రాశాడని చెప్తారు.
ఢిల్లీలో నూతన పార్లమెంటు భవనం. దానిపై కార్పొరేట్ల మాయామహల్‌! దానిలో దర్జాగా కాలి మీద కాలేసుకుని అదానీలు, అంబానీలు, టాటాలు, ఆదిత్య బిర్లాలూ, మిట్టల్స్‌.. కార్పొరేట్‌ దిగ్గజాలు దిలాసాగా. రక్షణ కవచంలా చేతులు కట్టుకుని మోడీజీ అండ్‌ కో! చుట్టూ వారు తవ్వించిన కందకం. దాన్లో నరకం నుండి దారి మళ్ళించిన వైతరిణి! కార్మికులు కన్నెత్తి చూడకుండా మిరుమిట్లు గొలిపే కంచెలుగా భావించబడుతున్న ఆ నాలుగు లేబర్‌ కోడ్స్‌! కాల చక్రాన్ని వందేళ్ళు వెనక్కి తిప్పగలమన్న ధీమాలో బృహస్పతులు, వాచస్పతులు.
వారికి భూతకాలంలోకి తొంగి చూడగల ధైర్యంలేదు. కనీసం మూలవిరాట్‌ గాలి మోటార్‌ తిరిగొచ్చిన దేశాల్లో జరిగే పరిణామాలను సైతం చూడలేని కాబోది పక్షులు. వర్తమానంలో కుల సమీకరణాలను రూబిక్‌ క్యూబ్‌ తిప్పుకుంటూ చేసే మంత్రాంగమే బొందితో కైలాసాన్ని చేరుస్తుందని ప్రగాఢ విశ్వాసం. కష్టజీవులు అలాంటి వారు కాదు. భవిష్యత్తు పై విశ్వాసంతో వర్తమానంలో పోరాడాలనే సత్తా వుంది వారికి. అందుకే గతంలోకీ చూస్తారు. చూసి నేర్చుకుం టారు. నేర్చుకుని పోరాడతారు.
19వ శతాబ్ది మధ్య నుండీ 60/65 ఏండ్లు మన దేశంలో జాతీయోద్యమంతో పెనవేసుకుని ముమ్మరంగా కార్మిక పోరాటాలు సాగాయి. 1920లో ఏఐటీయూసీ ప్రారంభ సమావేశానికి అప్పటికి మన దేశంలోని పెద్దపెద్ద పెట్టుబడిదారులంతా హాజరై బ్రిటిష్‌ వారి కంపెనీల్లో యూనియన్లు పెట్టి ఆర్థికంగా దెబ్బతీయమని ఆశీర్వదించారు. కానీ మన, పర బేధాల్లేకుండా దోపిడీ ఎక్కడుంటే అక్కడ కార్మికులు పోరాడారు. నియంత్రించే మార్గాల కోసం అన్వేషించింది బ్రిటీష్‌ సామ్రాజ్యం.
అంతకు చాలా ముందు నుండీ వున్న కార్మికుల డిమాండుకు తలొగ్గి చుట్ట రూపం ఇచ్చింది. 1926లో ట్రేడ్‌ యూనియన్‌ చట్టం ఆవిర్భవించింది. 1928, 1929ల్లో కార్మిక సమ్మెల వెల్లువ పెరిగింది. మన నిజాం రైల్వేతో సహా, దేశంలోని వివిధ రైల్వే కంపెనీల్లో సమ్మెలు ఉధృతంగా సాగాయి. బొంబాయి ప్రెసిడెన్సీలో, ముఖ్యంగా బొంబాయి నగరంలోని బట్టల మిల్లు కార్మికులు రెండు విడతలుగా ఏడాది పాటు సమ్మె చేశారు. (ఇవన్నీ భారతీయ పెట్టుబడి దార్లవే) బొగ్గు గనుల్లో, జూట్‌ మిల్స్‌లో సమ్మె సైరన్‌లు మోగాయి. దాంతో వాటి నియంత్రణకు ట్రేడ్‌ డిస్ప్యూట్‌ చట్టం ఆవిర్భవిం చింది. కన్సీలియేషన్‌ బోర్డు లొచ్చాయి. ప్రజా ప్రయోజన కంపెనీల్లో 14 రోజుల ముందు నోటీసివ్వాలనే పద్ధతి వచ్చింది. సాధారణ సమ్మెలను నిషేధించారు. ఇదికాక పబ్లిక్‌ సేఫ్టీ చట్టం వచ్చింది. భారతదేశమంతటి నుండీ 31మంది ట్రేడ్‌ యూనియన్‌ నాయకులను (అందులో ముగ్గురు బ్రిటన్‌ పౌరులే) ఏర్చి, కూర్చి వారిపై మీరట్‌ కుట్ర కేసు బనాయించారు. అయినా, కార్మికోద్యమ పురోగమనాన్ని నిరోధించేలేక పోయారు.
స్వాతంత్య్రానంతరం జస్టిస్‌ గజేంద్ర గట్కర్‌ ఆధ్వర్యంలో (1966-69) మొదటి జాతీయ లేబర్‌ కమిషన్‌ వేశారు. ఆ తరువాత 1978లో జనతా ప్రభుత్వం తేబోయిన పారిశ్రామిక సంబంధాల బిల్లు పాలకుల వర్గ స్వభా వానికి నిదర్శనం. ఇందిరాగాంధీ ఎమర్జెన్సీ పాలనపై పోరాడి అధికారంలోకి వచ్చిన జనతా పార్టీ కార్మికులపై మాత్రం విల్లు ఎక్కుపెట్టే ఉంచింది. సమ్మె చేయాలంటే ఆ పరిశ్రమలోని మొత్తం కార్మికుల్లో 60 శాతం మంది రహస్య బ్యాలెట్‌లో ఓటు వేయాలని, దాన్ని డీసీయల్‌ పర్యవేక్షించాలని బిల్లులో ఉంది. కన్సీలియేషన్‌ విఫలమైన 60 రోజుల తరువాత సమ్మెలోకి వెళ్ళాలట. అత్యవసర సర్వీసుల్లో సమ్మెలే చేయరాదట. చివరిది ఏదో ఒక రూపంలో నేటికీ కొనసాగుతుండగా మిగిలిన వాటిని కార్మికవర్గం పోరాడి ఓడించింది. ఐఆర్‌ బిల్లు బుట్టదాఖలైంది. రాజీవ్‌ గాంధీకి 400+ సీట్లు లోక్‌సభలో రాగానే 1988లో మరో ప్రయత్నం జరిగింది. మళ్ళీ కార్మికోద్యమ సత్తాతో ఆ ప్రభుత్వం తోక ముడిచింది.
2002లో రెండవ జాతీయ లేబర్‌ కమిషన్‌ సిఫార్సులొచ్చొయి. దీని ప్రతిపాదకుడు జనతా ప్రభుత్వంలో ఐఆర్‌ బిల్లు తెచ్చిన ఫ్యూడల్‌ దొర రవీంద్రవర్మే! వాటి కొనసాగింపే నేటి లేబర్‌ కోడ్స్‌. కార్మిక సంఘాలను నిర్వీర్యం చేయడం, సమ్మె చేసే హక్కు లేకుండా చేయడం, కార్మికులను మళ్ళీ బానిసలుగా చేయడం, పెట్టుబడిని అందలమెక్కించడం వీటన్నిటిలో కీలకాంశాలు.
దేశంలో బూర్జువా, భూస్వామ్య పాలనకు స్థిరత్వం వచ్చిందంటే తమ తుపాకులను తమను సమాధి చేసే(గ్రేవ్‌ డిగ్గర్స్‌)వైపు తిప్పటం ఆనవాయితీ. అందుకే 1998, 1999ల్లో అధికారంలోకి వచ్చిన వాజ్‌పేయి తన ప్రభుత్వ ‘స్థిరత్వం’ గురించి మాట్లాడేవారు. బూర్జువా పాలకుల స్థిరత్వం కష్టజీవుల పై దాడి ఒకదానికొకటి విలోమాను పాతంలో వుంటాయి. అందుకే కోర్టులూ, పత్రికలు, మేధావులూ పట్టించుకోకుండా వదిలేసిన వాస్తవాల్ని జనం, పత్రికలు వెలికి తియ్యాలి. జనం భూమిలో సంఘాలు నాటే వారికి ఊపిరిలూదాలి.
కార్మికులు వైతరణిని ఈదగలరని, కందకాలను లంఘించగలరని, కార్పొరేట్‌ కోటలు బద్దలు కొట్టగలరని త్వరలోనే తేలుతుంది.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -