Thursday, August 21, 2025
E-PAPER
spot_img
Homeతెలంగాణ రౌండప్సహాయ పరికరాల దరఖాస్తూ గడువు పొడిగించాలి: సురూపంగా ప్రకాష్

సహాయ పరికరాల దరఖాస్తూ గడువు పొడిగించాలి: సురూపంగా ప్రకాష్

- Advertisement -

నవతెలంగాణ – భువనగిరి కలెక్టరేట్ 
షరతులు పెట్టి వికలాంగులకు సహాయ పరికరాలు అందకుండా అధికారులు చేస్తున్న కుట్రలను మానుకోవాలని, వికలాంగులు సహాయ పరికరాల పొందెందుకు దరఖాస్తూ గడువు జూన్ 30 వరకు పొడగించాలని ఎన్ పి ఆర్ డి  జిల్లా అధ్యక్షులు సురూపంగా ప్రకాష్ డిమాండ్ చేశారు. సోమవారం జిల్లా కలెక్టర్ కార్యాలయంలో   వికలాంగుల హక్కుల జాతీయ వేదిక తెలంగాణ రాష్ట్ర కమిటీ పిలుపు  మేరకు సహాయ పరికరాలు దరఖాస్తు గడువును ఈ నెల 30 వ తేదీ వరకు పొడిగించాలని కలెక్టర్ కార్యాలయ ఏఓ జగన్ మోహన్ కి వినతి పత్రం అందజేశారు. అనంతరం అయన మాట్లాడుతూ  టెండర్స్ వేసిన పరికరాలన్నింటిని లబ్ధిదారులకు పంపిణి చేయాలని, మోటారైస్డ్ వెహికల్స్ టెండర్ 2000 లకు వేశారని,  ఆన్లైన్లో 1800 మాత్రమే వెహికల్స్ చూపిస్తుందనారు.  టెండర్స్లో పేర్కొన్న వాటికి పరికరాలు ఇవ్వకుండా అధికారులు చేస్తున్న ప్రయత్నాలు మానుకోవాలని, నోటరీ సర్టిఫికెట్ నిబంధనను వెంటనే విరమించుకోవాలని  డిమాండ్ చేశారు.  

సహాయ పరికరాలు పొందెందుకు వికలాంగుల సంక్షేమ శాఖ జూన్ 6నాడు నోటిఫికేషన్ జూన్ 7 నుండి 18 వరకు ఆన్లైన్ ద్వారా దరఖాస్తూ చేసిన వారికి మాత్రమే పరికరాలు మంజూరు చేయాలని ప్రభుత్వం నిర్ణయించిందన్నారు. 11 రోజుల గడువులో 4 రోజులు ప్రభుత్వ సెలవు దినాలు ఉన్నవి. దరఖాస్తుకు అవసరం అయిన సర్టిఫికెట్స్ తీసుకోవడనికి కనీసం 15 రోజుల సమయం పడుతుందనే విషయం అధికారులకు తెలియకపోవడం దురదృష్టకారం అని, చదువుతో సంబంధం లేకుండా 40 శాతం వైకాల్యం ఉన్న వాళ్లందరికీ  మోటారైస్డ్ వాహనాలు మంజూరు చేస్తామని చెప్పిన అధికారులు దరఖాస్తూ చేయడానికి మీ సేవా కేంద్రాలకు వెళ్ళితే అఫిడవిట్ తో పాటు తహసీల్దార్ నుండి ఆన్ ఎంప్లొయ్ సర్టిఫికెట్ తీసుకుని దరఖాస్తూకు జత చేయాలని నిబంధన పెట్టడం అంటే దరఖాస్తూ దారులను మోసం చేయడమే అవుతుందని అయన అన్నారు.  35 కోట్ల రూపాయలతో పరికరాలు ఇవ్వాలని నిర్ణయం చేసిన అధికారులు దరఖాస్తూ చేసుకోవడానికి షరతులు పెట్టి లబ్ధిదారులకు పరికరాలు అందకుండా చేయడమే దురదృష్టకరమని,  జూన్ 30 వరకు గడువు పొడగించాలని కోరారు. ఈ కార్యక్రమములో జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ బొల్లేపల్లి స్వామి నాయకులు పాండాలు శ్రీహరి ఐలయ్య చాంద్ పాషా నర్సింహా లు పాల్గొన్నారు. 

- Advertisement -
spot_img
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -spot_img
Ad
Ad