- Advertisement -
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్
అభ్యర్థులు తమ వన్ టైం రిజిస్ట్రేషన్ (ఓటీఆర్) అప్‌డేట్ చేసుకునేందుకు వీలుగా మార్చి 25 వరకు గడువు పొడిగించినట్టు తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ వెల్లడించింది. ఈ మేరకు సోమవారం కమిషన్ కార్యదర్శి ఎం.హరిత ఒక ప్రకటన విడుదల చేశారు. చివరి నిమిషంలో సాంకేతిక సమస్యలు రాకుండా అభ్యర్థులు ముందుగానే అప్ డేట్ చేసుకోవాలని సూచించారు. మరిన్ని వివరాలకు కమిషన్ వెబ్‌సైట్‌లో తెలుసుకోవచ్చు.
- Advertisement -



