Sunday, February 1, 2026
E-PAPER
Homeఖమ్మంఫిబ్రవరి 3న నామినేషన్ల ఉపసంహరణ గడువు 

ఫిబ్రవరి 3న నామినేషన్ల ఉపసంహరణ గడువు 

- Advertisement -

– రెండు ఫిర్యాదు లు మాత్రమే నమోదు 
– గడువు లోపు బీఫాం ఇవ్వకపోతే స్వతంత్ర గుర్తులే 
– మున్సిపల్ ఎన్నికల జిల్లా సహాయ అధికారి నాగరాజు 
నవతెలంగాణ – అశ్వారావుపేట

ఎన్నికల ప్రక్రియ లో ప్రధాన ఘట్టం నామినేషన్ లు ఉపసంహరణ గడువు ఈ నెల 3 వ తేది మంగళవారం సాయంత్రం 3 గంటల వరకు మాత్రమే నని మున్సిపల్ ఎన్నికల జిల్లా సహాయ అధికారి,స్థానిక మున్సిపల్ కమిషనర్ నాగరాజు ఆదివారం తెలిపారు. ఉపసంహరణ గడువు లోపు జాతీయ,రిజిస్టర్ పొలిటికల్ పార్టీ బీఫాం ఇవ్వకపోతే స్వతంత్ర అభ్యర్థి గా పరిగణిస్తారు అని, స్వతంత్ర ఎన్నికల చిహ్నం కేటాయింపు ఉంటుంది అని తెలిపారు.

నామినేషన్ లు రెండు ఫిర్యాదులు అందాయని,అవి పరిశీలించి జిల్లా ఎన్నికల అధికారులు కు నివేదిక ఇస్తామని అన్నారు. 9 వ వార్డు కౌన్సిలర్ అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేసిన కనకదుర్గ నామినేషన్ పత్రంలో తన ఇంటి పేరు “కారం” గా పేర్కొని,ఓటరు జాబితా లో “నక్క” నమోదు అవడం,

12 వ వార్డు కౌన్సిలర్ అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేసిన రమ్య నామినేషన్ పత్రంలో తన ఇంటి పేరు “అట్టం” అని,ఓటరు జాబితా లో “పోకల” పేర్కొన్న అంశాల పై వచ్చిన ఫిర్యాదులను స్వీకరించి వాటిని పరిశీలించి ఉన్నతాధికారులకు నివేదిక అందిస్తామని అన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -